టీడీపీలోకి డీఎస్‌ఆర్ ఎంట్రీ వైసీపీకి హ్యాండ్

490

ఉత్త‌రాంధ్రాలో ఇప్ప‌టికే వైసీపీ గాలి అంతంత మాత్రంగానే వీస్తోంది.. ఈ స‌మ‌యంలో కీలక నేత‌లు ఎవ‌రైనా పార్టీలో చేరుతారా అని చూస్తుంటే, చేరే అవ‌కాశం లేదు అనేలా రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారుతున్నారు.. మాజీ మంత్రులు ఎంపీలు మాజీ జిల్లా అధ్య‌క్షులు కాంగ్రెస్ నేత‌లు అంద‌రూ కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ వైపు ప‌రుగులు పెడ‌తారు అని అనుకున్నారు.. కాని ప‌రిస్దితి దీనికి భిన్నంగా ఉంది.. పార్టీలో ఉన్న నాయ‌కులే పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళుతున్నారు.

Image result for tdp flag

తాజాగా విజయనగరం జిల్లా పార్వతీపురం లో వైసీపీకి రాజీనామా చేసి ఓ కీల‌క నేత టీడీపీలో చేరారు… కొద్దికాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయ‌న తెలుగుదేశంలోకి రావాల‌ని, ఆయ‌న్ని పార్టీ నేత‌లు ఆహ్వానించారు… కొన్ని రోజులుగా వైసీపీకి దూరంగా ఉంటున్న సీనియర్‌ వైసీపీ నాయకుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావును సైకిల్ పార్టీ నేత‌లు పార్టీలోకి చేరాల‌ని ఆహ్వానించారు..

Related image

శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే చిరంజీవులు, ఎమ్మెల్సీ జగదీష్‌ సుదీర్ఘంగా చర్చించారు. ఇక శ్రీనివాసరావు ఇక్క‌డ వైసీపీ త‌ర‌పున నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ గా ఉన్న అల‌జంగి జోగారావుతో పొస‌గ‌క ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కొద్దిరోజులుగా దూరంగా ఉంటున్నారు.. దీంతో ఆయన్ని తెలుగుదేశంలోకి రావాలని స్దానిక నేత‌లు కోరారు…తాజాగా ఆయ‌న మాట‌లు చూస్తుంటే సీఎం స‌మ‌క్షంలో ఆయ‌న తెలుగుదేశం పార్టీలోచేరే అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది.