కాశ్మీర్ కోసం ఎంత ఖర్చు చేశామో తెలుసా…

68

జమ్మూ కాశ్మీర్ రాచపుండులా డెబ్బై ఏళ్ల నుంచి దేశాన్ని పట్టి పీడిస్తోంది. నిజానికి కాశ్మీర్ విలీనం కధ వింటే భారత్ ఎందుకు అంత సొమ్ము ఖర్చు చేయాలి అని సగటు పౌరుడు నిలదీసి ప్రశ్నిస్తాడు. కాశ్మీర్ ఓ సంస్థానం. స్వాతంత్రం వచ్చిన తరువాత సొంతంగానే ఉండాలనుకుంది. అప్పటి హిందూ రాజు మహారాజా హరి సింగ్ అటు పాకిస్తాన్ కి ఇటు ఇండియాకు కూడా సమదూరంగా ఉంటూ సొంత రాజ్యంగా కాశ్మీర్ ని పాలిద్దామనుకున్నాడు. అయితే ఆయన్ని పాకిస్తాన్ ఇబ్బందులకు గురి చేసింది. కాశ్మీర్ ని తమలో కలుపుకోవాలని ఎత్తులు వేసి అజాద్ కాశ్మీర్ దాకా తీసుకెళ్ళిపోయింది.

Image result for kashmir

దాంతో ఆయన భారత్ లో తమ విలీనాన్ని కోరుకున్నారు. ఆ తరువాత భారత సైన్యం వెళ్లి పాక్ పీచమ‌ణచి మిగిలిన భూబాగమంతా జమ్మూ కాశ్మీర్ గా చేసింది. అయితే షేక్ అబ్దుల్లా ప్రధానమంత్రిగా తరువాత కాలంలో వచ్చారు. ఆయన కశ్మీరీలకు కొన్ని ప్రత్యేక అధికారలను కోరడం, దానికి అప్పటి భారత దేశ ప్రధాని నెహ్రూ అంగీకరించి ఒప్పందం చేసుకోవడం జరిగింది. అదే ప్రత్యెక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణందీని వల్ల కాశ్మీర్ నుంచి ఒక్క పైసా భారత ఖజానాకు చేరదు. అదే సమయంలో కాశ్మీర్ కి భారత ఏటా లక్ష కోట్లు ఖ‌ర్చు చేస్తోందంటే ఆశ్చర్యం కలుగక మానదు. అక్కడ ప్రతి పౌరుడికి కేంద్రం 27 వేల రూపాయల వంతును ఖర్చు చేస్తోంది. దేశమంతా పన్నులు కడుతూంటే వారికి కేంద్రం తలసరి గా ఇచ్చే ఆదాయం కేవలం ఎనిమిది వేలు మాత్రమే. అదే కాశ్మీర్ లో తలా ఒకరికి 27 వేలు ఇస్తోంది. అయితే ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నా కూడా అక్కడ పేదలకు ఏమీ అందడం లేదు.

ఈ క్రింద వీడియో చూడండి

ఆ నిధులను హాయిగా అక్కడ పాలకులు వేరేగా ఖర్చు చేస్తున్నారు. భారత దేశం పేదరికంలో ఉండి కూడా కాశ్మీర్ కోసం ఇంతలా వెచ్చించ‌డం భావ్యమా. మరో వైపు విలీనం అవుతామ‌ని తమకు తాముగా వచ్చి రక్షణ కోరిన హరి సింగ్ కధ ఏంటి, మనం కాశ్మీర్ కోసం ఇంతలా ఖర్చు చేయడమేంటి. మరో వైపు సైనికుల ప్రాణాలు లక్షల్లో పోతున్నాయి. విదేశాల్లో భారత్ పరువు పోతోంది. కాశ్మీర్ ని అడ్డం పెట్టుకుని దేశమో ఉగ్ర భూతానికి పాక్ ఆజ్యం పోస్తోంది. మొత్తం ఈ రోగానికి మోడీ మందు వేశారు.