జ‌గ‌న్ కుటుంబం పై అలా మాట్లాడ‌కండి – ప‌వ‌న్ ట్వీట్

434

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌గ‌న్ మ‌ధ్య వార్ ఇప్పుడు ఏపీలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ముఖ్యంగా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఏపీలో రాజ‌కీయ హీట్ పుట్టిస్తే ఆ త‌ర్వాత జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా పెద్ద చ‌ర్చ‌కు దారితీశాయి.. ఇక ప‌వ‌న్ పై జ‌గ‌న్ కామెంట్లు చేసిన వెంట‌నే ఇటు రాజకీయంగా విమ‌ర్శ‌ల‌ను ప‌క్క‌న పెట్టిన జ‌నసేన అభిమానులు, నేరుగా జ‌గ‌న్ పై ట్వీట్ల దాడి మొద‌లుపెట్టారు… ఇటు జ‌గ‌న్ పై నేరుగా సోష‌ల్ మీడియాలో ట్రోల్ మొద‌లు పెట్టింది జ‌న‌సేన సైన్యం.

Image result for jagan

దీంతో వైసీపీ అభిమానులు జ‌గ‌న్ సైన్యం కూడా ప‌వ‌న్ పై జ‌న‌సేన‌పై ట్రోల్ మొద‌లుపెట్టారు… ఇక తాజాగా ప‌వ‌న్ ఈ విష‌యంపై మాట్లాడారు.. తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులను కానీ, ఆ ఇంటి ఆడపడుచులను కానీ వివాదంలోకి లాగొద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విన్నవించారు…అందరికీ నా విన్నపం అంటూ ట్విట్టర్‌లో పవన్ కల్యాణ్ ఓ పోస్టు పెట్టారు.

Image may contain: 1 person, beard
జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గారు నన్ను వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించిన తీరుపై చాలామంది నా అభిమానులు బాధ‌ప‌డ్డారు అని నా దృష్టికి వ‌చ్చింది… నేను ప‌ర్స‌న‌ల్ గా ఎవ‌రి జోలికి వెళ్ల‌ను రాజకీయ ల‌బ్ది కోసం వాడుకోను అని అనుకోను అని అన్నారు… నాకు ఎవ‌రి మీద వ్య‌క్తి పబ్లిక్ పాలసీల మీదే మిగతా పార్టీలతో విభేదిస్తాను కానీ, నాకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవు.ఈ తరుణంలో ఎవరైనా జగన్ మోహన్‌రెడ్డిగారిని కానీ, వారి కుటుంబ సభ్యులను కానీ, వారి ఇంటి ఆడపడుచులను కానీ ఈ వివాదంలోకి లాగవద్దని మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటున్నాను అని అన్నారు ప‌వ‌న్.