నాపై అలాంటి కామెంట్లు చేయ‌కండి చంద్రబాబు

258

తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఒక్కోసారి కొన్ని డిఫ‌రెంట్ వ్యాఖ్య‌లు చేస్తూ ఉంటారు.. చంద్ర‌బాబు ని పొగుడుతూ దేశానికి ప్ర‌ధానమంత్రి అవ్వాల్సిన నేత అని కితాబిస్తూ ఉంటారు. ఇది ఏపీ వ‌ర‌కూ బాగానే ఉన్నా కేంద్రంలో చ‌క్రం తిప్పాలి అనుకునే నేత‌లు మాత్రం కాస్త దీనిపై క‌న్నెర్ర చేస్తారు. అస‌లే ఇప్పుడు మోడీపై కారాలు మిరియాలు నూరుతున్న చంద్ర‌బాబు స‌ర్కారు, తాజాగా ప్ర‌ధానిపై కూడా సీఎం చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముందుకు రానున్నారు అనేది కొంద‌రు తెలుగుదేశం నాయ‌కులు ఓ అడుగు ముందుకువేసి కామెంట్లు చేస్తున్నారు.

Image result for chandra babu
టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు..అలాంటి కామెంట్ల వల్ల నష్టం జరుగుతోంది అని దీనివ‌ల్ల లాభం కాదు క‌దా ఎంతో న‌ష్టం జ‌రుగుతుంది అని చెప్పార‌ట‌.జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, తాను ప్రధాని అవుతాననే ప్రచారం వల్ల ఇబ్బంది వస్తుందని చంద్రబాబు అన్నారు. ఇలాంటి కామెంట్లు ఏ నాయ‌కులు చేయ‌కూడ‌దు అని చెప్పార‌ట‌.

Image result for chandra babu

ఇక తెలంగాణ‌లో నాయ‌కుల‌పై ఐటి అధికారులు దాడులు చేస్తున్నారు. మ‌న నేత‌లు మంత్రుల‌పై కూడా కొంద‌రు టార్గెట్ చేశారు అని తెలుస్తోంది. చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి అని చెప్పార‌ట. అందుకే ఈ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలని పార్టీ సినియ‌ర్లు నేత‌ల‌కు చంద్రబాబు స‌ల‌హా ఇచ్చార‌ట‌, ఇక ఎమ్మెల్యేలు ప్ర‌జాప్ర‌తినిధులు చాలా జాగ్ర‌త్త‌గా ప‌ర్య‌ట‌న‌లు చేయాలి అని పోలీసుల ర‌క్ష‌ణ తీసుకోవాలి అని మావోల దాడితో చంద్ర‌బాబు సూచ‌న‌లు చేశారు అని తెలుస్తోంది.