అళ‌గిరి సంచ‌ల‌న నిర్ణ‌యం

384

త‌మిళ‌నాట క‌రుణా నిధి మ‌ర‌ణం ఇంకా జీర్ణించుకోలేదు ఎవ‌రూ… అయితే ఇప్పుడు ఇంట రాజ‌కీయం ర‌చ్చ‌కెక్కుతోంది.. త‌న చిన్న‌కుమారుడు స్టాలిన్ కు త‌న రాజ‌కీయ వార‌స‌త్వం ఇచ్చారు క‌రుణానిధి.. పెద్దకుమారుడు అళ‌గిరిని కరుణా ఏ నాడో ప‌క్క‌న‌పెట్టారు.. పార్టీ త‌ర‌పున బాధ్య‌త‌లు అన్నీ నాటి నుంచి త‌న చిన్న‌కుమారుడు స్టాలిన్ కు అప్ప‌గించారు. డీఎంకే అధ్యక్షుడుగా దివంగత నేత క‌రుణానిధి ఉండేవారు. ఇక ఆయ‌న పెద్ద కుమారుడు అళ‌గిరి తాజాగా ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

Image result for అళ‌గిరి

అళగిరి తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు.. ఇందుకోసం ఆయన లక్ష మంది మద్దతుదారులతో చెన్నై నగర వేదికగా బలప్రదర్శనకు దిగనున్నారు. ఇందులో భాగంగా ఆయన వచ్చే నెల 5వ తేదీన నగరంలో శాంతిప్రదర్శన నిర్వహించనున్నారు.. త‌న తండ్రికి శ్ర‌ద్దాంజ‌లి ఘ‌టించి రెండు రోజుల్లో త‌న నిర్ణ‌యం చెబుతా అని చెప్పిన అళ‌గిరి తాజాగా ఈ నిర్ణ‌యం వెల్ల‌డించారు..

Related image

ఇదిలావుంటే, ఇటీవల డీఎంకే కార్యవర్గ సమావేశం అత్యవసరంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.అన్బళగన్‌ అధ్యక్షత వహించగా, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంకే స్టాలిన్‌, మరో సీనియర్‌ నేత దురైమురుగన్‌తో పాటు ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశం త‌ర్వాత స్టాలిన్‌ మాట్లాడుతూ, మున్ముందు ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొని విజయబావుటా ఎగురవేస్తామని ప్రకటించారు. తాను మదురై వంటి దక్షిణాది జిల్లాలకు మాత్రమే పరిమితంకాదని నిరూపిం చేలా అళగిరి బలప్రదర్శన ఉండబోతున్నట్టు సమాచారం. ఇక అళ‌గిరి వెనుక బీజేపీ ఉందా అనే అనుమానం కూడా వ‌స్తోంది.. ఇటు క‌రుణానిధి కుమారులు రాజ‌కీయ వైరంతో అన్నాడీఎంకే ఎటువంటి నిర్ణ‌యాల‌తో ముందుకు వెళుతుందో చూడాలి.