ప్రారంభమయిన కరుణానిధి అంతిమ యాత్ర…

389

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్‌లో జరిపేందుకు మద్రాసు హైకోర్టు అంగీకరించింది. దీంతో కరుణానిధి కుటుంబసభ్యులు మెరీనాబీచ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు కరుణ అంతిమ యాత్ర పారంభం అయింది. రాజాజీ హాల్‌ నుంచి మెరీనా బీచ్‌ వరకు కరుణానిధి అంతిమయాత్ర జరగనుంది. సాయంత్రం 6 గంటలకు కరుణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు…

ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, సినీ నటులు కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, సూర్య తదితర రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ప్రస్తుతం కరుణ పార్థివ దేహాన్ని ప్రజలు, ప్రముఖల సందర్శనార్థం రాజాజీ హాల్‌లో ఉంచారు.