తెలంగాణ‌లో అసెంబ్లీ రద్దు

331

తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దు అయింది. ముఖ్య‌మంత్రిగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు తెలంగాణకు ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రిగా మారారు..తెలంగాణ అసెంబ్లీ రద్దు తీర్మానానికి గవర్నర్ ఆమోదం తెలిపారు… కేబినెట్ భేటీ త‌ర్వాత మంత్రుల‌తో క‌లిసి, గ‌వ‌ర్న‌ర్ ని క‌లిశారు కేసీఆర్. ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలిపారు. ఇక రాజ్ భ‌వ‌న్ నోటిఫికేష‌న్ కూడా విడుద‌ల చేసింది.


ఈ నోటిఫికేషన్‌ను ఈసీ, అసెంబ్లీ కార్యదర్శికి రాజ్‌భవన్‌ వర్గాలు పంపాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా రద్దయింది… ఇదిలా ఉంటే, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌ను గవర్నర్ కోరారు. ఇందుకు కేసీఆర్ కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్‌, మంత్రులు కొనసాగాలని జీవో నెంబర్‌ 134ను సీఎస్‌ ఎస్కే జోషి జారీ చేశారు.

తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత జూన్ 2 -2014 న తెలంగాణ సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు కేసీఆర్.. ఇంకా స‌మ‌యం ఉండ‌గానే కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళుతున్నారు. నాలుగు సంవ‌త్స‌రాల 3 నెల‌ల 4 రోజుల పాల‌న చేసింది టీఆర్ ఎస్.. ఇక రేపు హుస్నాబాద్ లో కేసీఆర్ ఎన్నిక‌ల శంఖారావం పూరించ‌నున్నారు.