జ‌గ‌న్ బంధు రాజ‌కీయం పై ప్ర‌జ‌ల్లో చ‌ర్చ ?

379

కాపుల ఆరాధ్యంగా పూజించే దివంగ‌త నేత రంగా పై కామెంట్లు చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయుకుడు గౌతమ్‌ రెడ్డి మ‌ళ్లీ పార్టీలో యాక్టీవ్ అవ‌డం, ఆయ‌న‌కు జ‌గ‌న్ మ‌ళ్లీ పార్టీలో రెడ్ కార్పెట్ ప‌ర‌చ‌డం పై వైసీపీలో కాపులు ఇంకా కొంద‌రు జీర్ణించుకోవ‌డం లేదు.. పార్టీలో ఉన్న కాపు నేత‌లు ఆయ‌న‌కు స‌పోర్ట్ గా ఉన్నారా అంటే లేదు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.. ఇటు వంగ‌వీటి రంగా కుమారుడు ఆయ‌న త‌న‌యుడు రాధా పార్టీలో వివాదాలు లేకుండా ఉండాలి అని వివాదాల‌కు ఫుల్ స్టాప్ పెట్టారు… మిన‌హా ఆయ‌న‌కు గౌతమ్‌ రెడ్డితో క‌లిసి పార్టీలో ప‌నిచేయ‌డానికి ఎటువంటి ఇష్టం లేదు అని అంటున్నారు.

Image result for gowtham reddy

ముఖ్యంగా ఇప్పుడు పార్టీలో గౌత‌మ్ రెడ్డికి ఎటువంటి కీల‌క ప‌ద‌వి ఇచ్చినా, ఇక్క‌డ స‌పోర్ట్ చేసే నాయ‌కులు ఎవ‌రూ ఉండ‌రు అనేది ఇక్క‌డ జ‌రుగుతున్న చ‌ర్చ… ముఖ్యంగా క‌మ్యూనిస్ట్ నేత‌గా ఎదిగి కార్పొరేట‌ర్ స్టాయి నుంచి ఇప్పుడు వైసీపీలో నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జ్ అయ్యారు.. ఆ స‌మ‌యంలో కాపుల‌పై ఇటువంటి కామెంట్లు చేసి పార్టీ నుంచి స‌స్పెండ్ అయ్యారు. ఇక తర్వాత జ‌గ‌న్ ని పాద‌యాత్ర‌లో క‌లిసి పార్టీలో యాక్టీవ్ అయ్యారు.. ఇక రాధా కూడా ఈ విష‌యంలో ముందు వ్య‌తిరేకించినా ఈ స‌మ‌యంలో ఎందుకు అని ఆయ‌న వెన‌క‌డుగు వేశారు.

Image result for gowtham reddy

మ‌రి ఇప్పుడు విజ‌య‌వాడ‌లో వీరి ఇద్ద‌రూ పార్టీ త‌ర‌పున స‌పోర్ట్ చేసుకున్నా అక్క‌డ కాపు ఓట‌ర్లు గౌత‌మ్ రెడ్డికి స‌పోర్ట్ చేస్తారా అనేది ఇక్క‌డ ఆలోచించాల్సిన విష‌యం.. గౌత‌మ్ రెడ్డి వైయ‌స్ జ‌గ‌న్ కుటుంబానికి బంధువు.. దీంతో ఆయ‌న బంధుప్ర‌తితోనే పార్టీలోకి తీసుకున్నారు అని అంటున్నారు.. మ‌రి చూద్దాం పార్టీల అధినేతల నిర్ణ‌యాలు ఎలా ఉన్నా ప్రజా ఓటు ఎటువైపు వెళుతుందో.