వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు మూడురోజుల ముందు జ‌గ‌న్ తో ఏం చెప్పారో తెలుసా

235

వైయ‌స్ వివేకానంద‌రెడ్డి మ‌ర్డ‌ర్ విష‌యంలో పోలీసులు అన్ని కోణాల్లో విచార‌ణ జ‌రుపుతున్నారు, ఇప్ప‌టికే సిట్ వైయ‌స్ కుటుంబంలో అంద‌రిని విచార‌ణ‌కు పిలిచింది, వైయ‌స్ వివేకానంద‌రెడ్డికి ఇంటిలో ఎవ‌రికి అయినా త‌గాదాలు ఉన్నాయా, ఎందుకు ఇలాంటి దారుణ‌మైన ప‌రిస్దితి వివేకాకు వ‌చ్చింది ఇంటి స‌భ్యుల‌తో ఆర్దిక లావాదేవీల విష‌యంలో గొడ‌వ‌లు జ‌రిగాయా అనే కోణంలో కూడా పోలీసులు కుటుంబ స‌భ్యుల‌ను విచారించారు, ఎలాంటి విభేదాలు త‌మ‌కు లేవ‌ని రాజ‌కీయంగా వినిపిస్తున్న మాట‌లే కాని ఆయ‌న ఎవరికి ఎప్పుడూ ఏ హాని త‌ల‌పెట్ట‌లేదు అని తెలియ‌చేశారు వారు. ఈ స‌మ‌యంలో జ‌గ‌న్ రాజ‌కీయంగా క‌డ‌ప జిల్లా వైసీపీ బాధ్య‌త‌లు బాబాయ్ వివేకాకు అప్ప‌గించాలి అని అనుకున్నార‌ట అందుకే అధికారంలోకి రాగానే మీకు మంత్రి ప‌ద‌వి ఇస్తాను బాబాయ్ అని చెప్పార‌ట వైయ‌స్ వివేకానంద‌రెడ్డికి, అప్ప‌టి వ‌ర‌కూ డ‌ల్ గా క‌నిపించిన వివేకా ఆనందంతో పార్టీ కార్య‌క్ర‌మాలు ముందుకు తీసుకువెళ్లారు అని కేడ‌ర్ చెబుతున్నారు.

Image result for ys vivekananda reddy letter

ఈ సారి ఎన్నికల్లో విజయమ్మ, షర్మిలను పోటీ చేయమని కోరారట‌. హత్య జరగకముందు మూడురోజుల క్రితం లోట్‌సపాండ్‌లో జగన్‌ను కలిశార‌ట వివేకా . జగన్‌ను కలిసి వచ్చిన తరువాత ఎంతో హుషారుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటికి వచ్చి దారుణహత్యకు గురయ్యారు. ఇంటి వాళ్ల హస్తం లేనిదే వివేకా హత్య జరగదు. ఇది ఇంటి దొంగల పనే..’’ అంటూ కొమ్మ పరమేశ్వర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానంద‌రెడ్డి రాజకీయాలు, ఇతర అంశాలు నాతో చెప్పేవారు. షర్మిలను ఎంపీగా పోటీ చేయమని వివేకా మొదట అడిగారు. షర్మిలా లేదా విజయమ్మను పోటీ చేయాలని ఆయన కోరారు. జగన్‌ రెడ్డితో చర్చించి మీ ఫ్యామిలీలో మీరే నిర్ణయం తీసుకోవాలని నేను చెప్పా. వివేకాను ఎంపీగా పోటీ చేయమని కుటుంబ సభ్యులు వత్తిడి తెచ్చారు. లేదా అవినా్‌షరెడ్డి పోటీ చేస్తే మెజార్టీ తగ్గుతుందని వివేకా అభిప్రాయపడేవారు. నేను మాత్రం ఎంపీగా పోటీ చేయలేనని కుటుంబ సభ్యులకు చెప్పానని వివేకా నాతో చెప్పారు.

ఈ క్రింది వీడియో చూడండి 

ఓ రోజు విజయమ్మ, షర్మిలా ఎదుటే వివేకా పోటీ చేయలేనని చెప్పినప్పుడు మా మండల నాయకులు కూడా ఉన్నారు. ఓ రోజు వివేకా డల్‌గా కనిపించడంతో ఏం తోటకాడికి పోయారా..? ఎందుకు అలా ఉన్నారని ప్రశ్నించాను. మూడురోజుల తరువాత జగన్‌రెడ్డిని కలిసి వచ్చిన వివేకా ఎంతో హ్యాపీగా కనిపించారు. కలిసి బాగా పనిచేయాలని జాగ్రత్తలు చెప్పేవారు. జగన్‌ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పారన్నారు. వివేకా ఎదుగుదల చూడలేకే ఈ హత్య చేసి ఉంటారు. ఆరు నెలలకొకసారి వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పులివెందులకు వచ్చేది, ఎప్పుడూ వివేకా ఒంటరిగానే ఉండేవాడు. ఒంటరిగా ఉన్నా లైసెన్సు గన్‌ ఆయన వద్ద ఉంటుంది. హంతకులు తలుపు పగలగొట్టుకుని చప్పుడు చేస్తే వివేకా వెంటనే మాకు ఫోన్‌ చేసేవారు అని చెప్పాడు, అయితే జ‌గ‌న్ ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తారు అనే విష‌యం బ‌య‌ట వారికి తెలియ‌డంతో కావాల‌నే ఆయ‌న ఎదుగుద‌ల‌ని ఓర్చుకోలేని వారు ఆయ‌న్ని మ‌ట్టుబెట్టారు అని అనుమానం అయితే వ‌స్తోంది. ఆయ‌న ఇటీవ‌ల త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంది అని బ‌య‌ట‌వారికి చెప్పారు ఇది తెలిసిన ఇంటి దొంగ‌లు ప్ర‌త్య‌ర్దుల‌తో క‌లిసి ఈ ప‌నికి ప‌థ‌కం ర‌చించారా అనే అనుమానం కూడా క‌లుగుతోంది. ఈకోణంలో కూడా పోలీసులు కేసుని ఇన్వెస్టిగేష‌న్ చేస్తున్నార‌ట‌.