టీడీపీకి మరో షాక్… విశాఖలో పార్టీ ఆఫీస్‌కు కూల్చివేత నోటీసులు

113

ఏపీలో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మొన్నటికి మొన్న టీడీపీ ప్రజావేదికను కూలగొట్టిన జగన్ ఇప్పుడు మరొక భవనానికి నోటీసులు జారీ చేశాడు. అన్ని జిల్లాలలో ఉన్న అక్రమ కట్టడాలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో అధికారులు వాటి వేటలో పడ్డారు. విశాఖ‌లో టీడీపీ ప్ర‌ముఖ నేత‌ల ఆక్ర‌మ‌ణ‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఆ వెంట‌నే అధికారుల ఆదేశాల మేర‌కు వారి అక్ర‌మ నిర్మాణాలు కూల్చేసారు. ఇందులో టీడీపీ ప్ర‌ముఖులు మాజీ ఎంపీ ముర‌ళీ మోహ‌న్‌తో పాటుగా సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు టీడీపీకే చెందిన మ‌రి కొంద‌రు నేత‌ల బిల్డింగ్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఇది టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. దీని పైన టీడీపీ నేత‌లు ఆరా తీస్తున్నారు. అక్ర‌మ నిర్మాణాలు ఎక్క‌డ ఉన్నా ఎవ‌రివైనా కూల్చేయాలంటూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆదేశించ‌టంతో గ్రేట‌ర్ విశాఖ అధికారులు అప్పుడే ఆచ‌ర‌ణ‌లో పెట్టేసారు.

ఈ క్రింది వీడియో చూడండి

టీడీపీ ముఖ్య నేత మాజీ ఎంపీ ముర‌ళీ మోహ‌న్‌కు చెందిన ఓ నిర్మాణం పైన అధికారులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్లాన్‌ లేకుండా నిర్మించిన జయభేరి ట్రూ వ్యాల్యూ కార్‌ షోరూమ్‌ను టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూల్చేశారు. ఎంవీపీ సెక్టార్‌-11లో గల వెయ్యి గజాల స్థలంలో ప్లాన్‌ లేకుండా కొంతకాలం కిందట షెడ్‌ ఏర్పాటుచేసి అందులో షోరూమ్‌ నడుపుతున్నారు. ప్రస్తుతం అక్కడ పాత కార్ల క్రయవిక్రయాలు జరుగు తున్నాయి. దీనికి ప్లాన్‌ లేదని గుర్తించిన జోన్‌-2 టౌన్‌ప్లానింగ్‌ అధికారులు సీసీపీ విద్యుల్లత దృష్టికి తీసుకువెళ్ల గా ఆమె కమిషనర్‌ జి.సృజనకు తెలియజేశారు. తక్షణం దానిని కూల్చేయాలని కమిషనర్‌ ఆదేశించడంతో టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది యంత్రాలతో వ‌చ్చి వాటిని తొలగించారు. అదే స‌మ‌యంలో మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావుకు చెందిన క్యాంపు కార్యాల‌యం పైన గ్రేట‌ర్ విశాఖ అధికారులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించారు.

Image result for chandra babu

గంటా శ్రీనివాస రావు మంత్రిగా ఉన్న స‌మ‌యం నుండి క్యాంపు కార్యాల‌యం వినియోగిస్తున్నారు. జోన్‌-1 ప‌రిధిలోని భీమిలో ఉన్న గంటా క్యాంపు కార్యాల‌యానికి ఎలాంటి ప్లాన్‌లతో పాటు గా అనుమ‌తులు లేన‌ట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో పాటుగా జోన్‌-2 పరిధి ద్వారకానగర్‌లో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌కు చెందిన భవనం ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించినట్టు గుర్తించారు. వీటిని అధికారులు కూల్చి వేయాల‌ని అధికారులు నిర్ణ‌యించారు. ఈ మేర‌కు ఈ నేత‌ల‌కు స‌మాచారం ఇచ్చారు. త‌మ‌కు స‌మ‌యం కావాల‌ని గంటా కోరిన‌ట్లుగా తెలుస్తోంది. ఇదే ర‌కంగా విశాఖ న‌గ‌రంలో ఇత‌ర ప్రాంతాల్లో ఎక్క‌డైతే అక్ర‌మ నిర్మాణాలు ఉన్నాయో వాటిని తొలిగించాల‌ని క‌మిష‌న‌ర్ అధికారుల‌ను ఆదేశించారు. ఇప్పుడు విశాఖ‌తో ప్రారంభ‌మైన కూల్చివేత వ్య‌వ‌హారం ఇంకా ఎక్క‌డి వ‌ర‌కు కొన‌సాగుతుందో చూడాలి. మరి అక్రమ కట్టడాల విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాల గురించి విశాఖ టీడీపీ ఆఫీసుకు నోటీసులు జారీ చెయ్యడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.