ప్రధాని మోడీకి భారత రత్న.. ఆయన యుగపురుషుడు.. పార్లమెంట్‌లో డిమాండ్

85

నరేంద్ర మోడీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఇది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ వరుసగా రెండోసారి మనదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అతి కొద్దిరోజుల్లోనే తీసుకున్న అతి సున్నిత, కీలక అంశం ఆర్టికల్ 370 రద్దు చేయడం. దేశ ప్రధానిగా రెండోదఫా పగ్గాలను అందుకున్న రెండు నెలల వ్యవధిలోనే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకోవడం సాహసోపేతంగా అభివర్ణిస్తున్నారు. జమ్మూకాశ్మీర్ కు ఉన్న స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదాను రద్దు చేసి.. ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించడం చారిత్రాత్మకమని అంటున్నారు విశ్లేషకులు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా- జమ్మూ కాశ్మీర్ ఓ కేంద్ర పాలిత ప్రాంతంగా.. లడక్ మరో కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించబోతున్నాయి. ఇదే ఆర్టికల్ 370ని రద్దు చేయాలని కోరుతూ నరేంద్ర మోడీ గతంలో ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి. రోడ్డెక్కి నినదించిన సందర్భాలు చోటు చేసుకున్నాయి. రిలే నిరాహార దీక్షలను నిర్వహించిన సంఘటనలు ఉన్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘ్ సంచాలక్ గా ఆర్టికల్ 370 రద్దు కోసం ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఘటనలు చాలా ఉన్నాయి. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

Image result for modi

ఆర్టికల్ 370ని రద్దు చేయండి.. ఉగ్రవాదాన్ని తరిమి కొట్టండి..దేశాన్ని రక్షించండి అనే నినాదంతో ఆయన గతంలో తన ఉద్యమాలను కొనసాగించారు. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు.. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని కోరుతూ నరేంద్ర మోడీ చాలా సార్లు ఉద్యమాలను నిర్వహించారు. లాఠీ దెబ్బలను రుచి చూశారు. ఇప్పుడు ఏకంగా దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అతను చేసిందే చట్టం అందుకే ఆర్టికల్ 370 ని రద్దు చేశాడు. దేశప్రజల మన్ననలను పొందాడు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రి మోడితో పలువురు ప్రశంశలు కురిపించారు. ఈనేపథ్యంలోనే పార్లమెంట్ జీరో అవర్‌లో బీజేపీ మధ్యప్రదేశ్ ఎంపీ ప్రధాని నరేంద్రమోడిని యుగపురుషుడుగా అభివర్ణించాడు. ఈనేపథ్యంలోనే మోడీ భారత విశిష్ట పురస్కారమైన భారత రత్నను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలోనే ఎంపీకి మద్దతుగా సుమారు 70మంది ఎంపీలు పార్లమెంట్‌లో జైకోట్టారు. మోడీ నిర్ణయాన్ని యావత్తు దేశం స్వాగతిస్తుందని ఎంపీలు పేర్కోన్నారు.

ఈ క్రింది వీడియో ని చూడండి

అంత్యంత క్లిష్టమైన కశ్మీర్ సమస్యకు పరిష్కారం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ పలువురు ప్రజా ప్రతినిధులు పూర్తి మద్దతు తెలపగా,సిద్దంతపరంగా వ్యతిరేకించే పలు విపక్ష పార్టీలు కూడ ఆర్టికల్ 370కు సహకరించారు. ఈ నేపథ్యంలోనే దేశం మొత్తం మోడీ నిర్ణయం పై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి కేంద్రం నెగ్గించుకుంది. మరోవైపు మధ్యహ్నం లోక్‌సభలో కూడ బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ సంధర్భంగా మోడీ నిర్ణయంపై ఆపార్టీ ఎంపీలు జీరో అవర్‌లో ప్రస్థావించారు. ఈ సంధర్భంగా మాట్లాడిన మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ గుమాన్ సింగ్ దామోర్ మోడీని యుగపురుషుడిగా అభివర్ణించాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరాడు. ఇక ఈయనకు మద్దతుగా సభలోనే చాల మంది ఎంపీలు సభ దృష్టికి తీసుకువెళ్లారు. చూడాలి మరి ఎప్పుడు ఇస్తారో.