ఫిరాయింపు ఎమ్మెల్యేకు షాక్

383

వైసీపీలో గెలిచి తెలుగుదేశంలోకి పార్టీ ఫిరాయించిన విజ‌య‌వాడ వెస్ట్ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ కు వ‌రుస షాక్ ల మీద షాక్ లు త‌గులుతున్నాయి. త‌న పై ఆరోప‌ణ‌లు చేసే వారు అవి నిజ‌మో కాదో తెలుసుకుని చేయాలి అని గ‌తంలో అన్నారు.. అయితే బీకాం ఫిజిక్స్ అనే మాట‌తో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా దూరం అయింది… అంద‌ని ద్రాక్ష‌లా మారింది. ఇక వ‌చ్చే ఎన్నికల్లో జిల్లాలో మ‌రోనేత ఇక్క‌డకు వ‌చ్చి పోటీ చేసే ఛాన్స్ లు ఉన్నాయి అంటున్నారు… అయితే త‌న‌కు సీటు ఇవ్వ‌క‌పోతే త‌న కుమార్తెకు సీటు ఇవ్వాలి అని ఆయ‌న పార్టీ త‌ర‌పున పోరాడుతున్నారు.

Image result for జ‌లీల్ ఖాన్

ఇక తెలుగుదేశం పార్టీ మాత్రం జ‌లీల్ కు సీటు ఇచ్చేందుకు సుముఖంగా లేదు అని తెలుస్తోంది.ఇలాంటి స‌మ‌యంలో వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాల్సిన ఎమ్మెల్యేపై ప‌లు వివాదాలు విమ‌ర్శ‌లు ఇప్ప‌టికీ వ‌స్తూనే ఉన్నాయి..జుమ్మమసీద్‌ స్థలాన్ని అన్యాక్రాంతం చేస్తున్నారంటూ ముస్లిం సంఘాలు మండిపడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే ,వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ జలీల్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జుమ్మమసీద్‌ సెంటర్‌లో ఆందోళకు దిగాయి సంఘాలు..పలు ముస్లిం సంఘాల ఆందోళనతో విజయవాడలో ఉదృక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Image result for జ‌లీల్ ఖాన్

ముడుపులు తీసుకొని ముస్లిం ఆస్తులను ఇతరులకు అప్పగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. మొత్తానికి అస‌లే సెగ్మెంట్లో రాజ‌కీయంగా తెలుగుదేశానికి ఇప్పుడు వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి… ఇక సీటు పై కూడా ఇప్ప‌టికే త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు, మ‌రి ఈ స‌మ‌యంలో జ‌లీల్ గారి సెగ్మెంట్లో ఈ రచ్చ పై చ‌ర్చ జ‌రుగుతోంది.. మ‌రి చూడాలి అధినేత యాక్ష‌న్ ఏవిధంగా ఉంటుందో ఈ విష‌యం పై.