అల‌క‌ల‌కు దూరంగా దానం నాగేంద‌ర్

426

తెలంగాణ‌లో ఎన్నిక‌ల హీటు కేసీఆర్ పార్టీకి మ‌రింత తాకుతోంది.. ఓ ప‌క్క వ‌ర్గ‌పోరుతో సెగ్మెంట్ల‌లో నాయ‌కుల‌ను, కూల్ చేసే ప‌నిలో నాయ‌కులు ఉన్నారు.. అలాగే టికెట్లు ద‌క్క‌ని వారిని శాంతింప‌చేసి పార్టీలో ప‌ద‌వులు ఇచ్చే చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు…ఈ స‌మ‌యంలో కీల‌క నాయ‌కులు అంద‌రూ, కేసీఆర్ -కేటీఆర్ అలాగే క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీ పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. నాలుగుసంవ‌త్స‌రాలుగా పార్టీలో కొన‌సాగిన వీరు, కేసీఆర్ టికెట్ ఇవ్వ‌క‌పోయేస‌రికి ఒక్క‌సారిగా పార్టీ పై అధినేత‌పై రివ‌ర్స్ అయ్యేస‌రికి అంద‌రూ షాక్ అయ్యారు.

Image result for నాగేంద‌ర్

ఇదే అస‌లైన రాజ‌కీయం అంటూ చెబుతున్నారు.. ఈ స‌మ‌యంలో ఓ నాయ‌కుడు మాత్రం టికెట్ ద‌క్క‌క‌పోయినా కేసీఆర్ ని ఒక్క‌మాట అన‌డం లేదు.. ఆయనే దానం నాగేంద‌ర్..తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం జరుగుతోందని, తాను టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని మాజీ మంత్రి దానం నాగేందర్‌ స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డిని తాను ఓ హోటల్‌లో కలిసినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

Image result for నాగేంద‌ర్
టీఆర్‌ఎస్‌ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితా లో తన పేరు లేకపోవడం ఏ మాత్రం బాధించలేదన్నారు. అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత కాంగ్రెస్‌లోనూ అసంతృప్తి రావడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు రాకుండా చిత్తుగా ఓడించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. టీఆర్‌ఎస్‌ టికెట్‌ను ఎవరికి ఇచ్చినా వారి గెలుపుకోసం శ్రమిస్తానని వెల్లడించారు. మొత్తానికి దానం చెప్పిన స్టేట్ మెంట్లు బాగున్నాయి.. త‌న‌కు తానుగా పార్టీ మారి టీఆర్ఎస్ లోచేరారు.. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌కు ఎటువంటి హామీ కేసీఆర్ ఇవ్వ‌లేదు అని తెలియ‌చేశారు.. ఇప్ప్పుడు కూడా అదే జ‌రిగింది.. ఇక దానం కూడా ఇలాంటి స్టాండ్ పై ఉంటే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ గెలిస్తే ఎమ్మెల్సీ ఇచ్చి ఆయ‌న్ని మంత్రిని చేసినా ఆశ్చ‌ర్య‌పోవ‌న‌వ‌స‌రం లేదు.