బాబుకు ఓట‌మి చూపిద్దాం ఆ పార్టీ పిలుపు

391

ఏపీలో తెలుగుదేశం ప్ర‌భుత్వానికి ఓట‌మి చూపించాలి అని ఇటు రెండు ప్ర‌త్య‌ర్దిపార్టీలు జ‌న‌సేన వైసీపీ స‌మాయ‌త్తం అయి ఇప్ప‌టికే కార్య‌చ‌ర‌ణ ఆచ‌ర‌ణ‌లో పెట్టాయి.. ఈ స‌మ‌యంలో క‌మ్యూనిస్టులు కూడా క‌దం తొక్కారు..టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 640 మండలాల్లో ఎక్కడా అభివృద్ధి జరగలేదు.. ఏ ఒక్కరికీ లబ్ధి చేకూరలేదు.. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉంది..వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును ఓడించాలి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు.

Image result for cpi

తెలుగుదేశం ప్ర‌భుత్వం వ‌ల్ల ఏపీలో ఎవ‌రికి స‌రైన న్యాయం జ‌ర‌గ‌లేదు ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేని ఈ ప్ర‌భుత్వాన్ని ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు అని ఆయ‌న విమ‌ర్శించారు… ఇప్ప‌టి వ‌ర‌కూ అమరావతి, పోలవరం గురించే ఆలోచిస్తూ వచ్చారన్నారు. రాష్ట్రంలో ఇసుక, మైనింగ్, చీప్‌ లిక్కర్‌ మాఫియాలు పేట్రేగిపోతున్నాయన్నారు. ఇదంతా తెలుగుదేశం నేత‌లు వెనుక ఉండి జ‌రుగుతున్నాయి అని ఆయ‌న విమ‌ర్శించారు..

Image result for cpi

కర్నూలులో అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్‌ ఫ్యాక్టరీలో 12 మంది దుర్మరణం చెందారన్నారు. అధికారుల నుంచి ఎమ్మెల్యే, ఎంపీలు, టీడీపీ నాయకులందరూ లంచాలకు పని చేస్తున్నారని ఆరోపించారు. రాయ‌ల‌సీమ ప్రాంతాన్ని కూడా అభివృద్దికి దూరం చేశార‌ని ఇక్క‌డ సీపీఐ నేత‌లు విమ‌ర్శించారు.రాష్ట్ర విభజన తర్వాత రూ.94వేల కోట్ల రాష్ట్ర అప్పును చంద్రబాబునాయుడు రూ.2.49 లక్షల కోట్లు చేశారని, ఈయనకు అప్పులు చేయటమే తెలుసని, ప్రజలకు మేలు చేయటం తెలియదన్నారు. టీవీలో ప్ర‌భుత్వం పై ప్ర‌క‌ట‌న‌లు మిన‌హా తెలుగుదేశం చేసింది ఏమీ లేదు అని అన్నారు. ఇక నిరుద్యోగుల‌ను ఈ నాలుగు సంవ‌త్స‌రాలు ప‌క్క‌న పెట్టి ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తున్నామ‌ని చెప్ప‌డం వెనుక ఆంత‌ర్యం ప్ర‌జ‌లకు తెలుసు అని ఆయ‌న విమ‌ర్శించారు.