కేసీఆర్ పంచ్ ల‌కు ఏపీ నేత‌ల కౌంట‌ర్లు

241

తెలుగుదేశం పై కావాల‌నే కామెంట్లు చేస్తున్నారు అని, ఇలాంటి వ్యాఖ్య‌ల‌కు భ‌య‌ప‌డే వ్య‌క్తి కాదు చంద్ర‌బాబు అని, వ‌రుస పెట్టి తెలుగుదేశం నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి వ‌స్తుంది అనే భ‌యంతో కేసీఆర్ కావాల‌నే చంద్రబాబుని టార్గెట్ చేశారు అని ఆరోపించారు ఏపీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి… కేసీఆర్‌కి నోటి దురద ఎక్కువై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యక్తుల్ని కించపరచడం కేసీఆర్ నైజం అని మండిపడ్డారు ఆయ‌న‌.

Image result for kcr

తెలుదేశం పార్టీకి జాతీయ అధ్య‌క్షుడిగా ఉన్న ఆయ‌న ఎక్క‌డికి అయినా వెళ‌తారు అని, అన్నీ రాజ‌కీయ కోణాల్లో ఆలోచిస్తున్నారు, కావాల‌నే ఏపీలో కూడా ఐటీ దాడులు ఓ ప్లాన్ ప్ర‌కారం చేస్తున్నారు అని టీడీపీ నేత‌లు విమ‌ర్శించారు. ఇలాంటివి కావాలనే బీజేపీ చేస్తోందని ఇలాంటి ప‌నులు చేయ‌డం వల్ల ముఖ్యంగా పార్టీకి మైన‌స్ మిన‌హా మాకు ఏమీ ఉండ‌దు అని అంటున్నారు తెలుగుదేశం నేతలు, ఇక ముఖ్యంగా చంద్రబాబు ప‌రిపాల‌న‌పై కామెంట్లు చేస్తున్న మీరు ఎటువంటి వ్యాఖ్య‌లు చేసినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న సీఎం అవుతారు అని తెలుగుదేశం నేత‌లు చెబుతున్నారు.