రెండు చోట్ల పోటీచేస్తాం కొండా ముర‌ళి

356

తెలంగాణ‌లో ఎన్నిక‌ల వేడి మొద‌లైంది.. ఇటు 105 మంది అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించిన టీఆర్ఎస్ అధినేత, ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్, త‌న ఎన్నిక‌ల సైన్యం రెడీ చేసుకుంటున్నారు.. ఈ స‌మ‌యంలో టికెట్ రాని అభ్య‌ర్దులు త‌మ‌కు టికెట్ ఇవ్వ‌నందుకు అధికార పార్టీపై శివాలెత్తుతున్నారు.. కొంద‌రు పార్టీ మారి టికెట్ ఇచ్చేచోటుకు సాగిపోతున్నారు. ఇక తెలంగాణ‌లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మ‌హిళా నాయ‌కురాలు కొండా సురేఖ, ఇప్పుడు ఆమె తెలంగాణలో పొలిటిక‌ల్ ప్లాన్ ఏమీ వెయ్య‌బోతున్నారు అని అంద‌రూ ఆలోచిస్తున్నారు.

Image result for KONDA SUREKHA

ఇక తాజాగా ఆమె భ‌ర్త ఎమ్మెల్సీ, కొండా ముర‌ళీధ‌ర్ రావు ఆమె ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుంది అని తెలియ‌చేశారట కేడ‌ర్ కు.. పరకాల నుంచి కొండా సురేఖ, వరంగల్‌ తూర్పు నుంచి తమ కుమార్తె సుస్మితా పటేల్‌ బరిలో ఉంటారని కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు చెప్పినట్లు తెలుస్తోంది.. ఇక కొండా దంప‌తులు హ‌న్మ‌కొండ‌లో నాయ‌కుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.. మీకు నేను ఉన్నాను అనే భ‌రోసా ఇచ్చారు..ఈ నెల 23న ఆత్మకూరులో బహిరంగ సభ పెడదామని చెప్పినట్లు తెలిసింది.

Image result for KONDA SUREKHA

వరంగల్‌ తూర్పు, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో కొండా కుటుంబానికి ఎంతో పేరు కేడ‌ర్ ఉంది..ఈ నెల 8న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, కేసీఆర్‌కు కొండా దంపతులు పలు డిమాండ్లు చేశారు. ఈ డిమాండ్లకు సమాధానం చెప్పకపోతే కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాస్తామని ప్రకటించారు. ఈ లేఖ తర్వాత రాజ‌కీయంగా ఎటువంటి ప‌రిస్దితి ఉంటుందో చూడాలి.