అమిత్ షాపై అన‌ర్హ‌త వేటు?

391

అమిత్ షా బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యం నుంచే ఆయ‌నపై విమ‌ర్శ‌ల జోరు పెంచాయి విప‌క్ష పార్టీలు.. ఇక అప్ర‌తిహ‌సంగా విజ‌యాలు మూట‌గ‌ట్టుకుంటూ బీజేపీ అన్నీ రాష్ట్రాల్లో గెలుస్తూ రావ‌డంతో అమిత్ షా, మోదీ ద్వ‌యానికి తిరుగు లేకుండా పోయింది.. అదే బీజేపీకి ప్లస్ అయింది…. ఇక విప‌క్ష పార్టీలు కూడా తాజాగా షా ఏ విష‌యంలో దొరుకుతారా అని చూస్తున్నాయి.. తాజాగా కాంగ్రెస్‌, టీఎంసీలు వేర్వేరు అంశాలకు సంబంధించి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాని ఇరుకున పెట్టేందుకు పావులు కదిపాయి.

Image result for అమిత్ షా

అమిత్ షా రాజ్య‌సభ ఎన్నిక‌ల స‌మ‌యంలో నామినేష‌న్ స‌మ‌ర్పించారు.. అందులో తనకున్న రూ.25 కోట్ల అప్పును అమిత్‌షా ఎన్నికల నామినేషన్‌లో వెల్లడించనందున ఆయన్ను రాజ్యసభ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.
సీఈసీ ఓం ప్రకాశ్‌ రావత్‌కు వినతి పత్రం సమర్పించింది. కాంగ్రెస్ పార్టీ.

Image result for అమిత్ షా

ఇక బీజేపీ కూడా దీనిపై మండిప‌డుతోంది.. ఈ ఆరోప‌ణ‌లు అన్నీ అవాస్త‌వం అని విమ‌ర్శించారు బీజేపీ నాయ‌కులు.. అమిత్‌ షాకు టీఎంసీ ఎంపీ, ముఖ్యమంత్రి మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ లీగల్‌ నోటీసులు పంపారు…ఇటీవల కోల్‌కతార్యాలీలో పార్టీకి, తనకు పరువునష్టం కలిగించేలా షా వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు.. బెంగాలీల‌పై బీజేపీ వ్య‌త‌రేకంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని సీఎం మ‌మ‌త విమ‌ర్శించారు.. మొత్తానికి అన‌ర్హ‌త వేటు వేసేలా చెయ్యాల‌ని ఇరువైపులా అమిత్ షాను ఇరుకున పెడ‌దామ‌ని చూస్తున్నాయి కాంగ్రెస్ టీఎంసీ పార్టీలు..అని బీజేపీ విమర్శ‌లు చేస్తోంది.