తెలుగుదేశం ఎంపి ల ధర్నా…సోనియా మద్దతు…

379

రాష్ట్రం విడిపోయిన తరువాత కేంద్రంలో అధికారం లోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం విభజన హామీల అమలులో అలసత్వం ప్రదర్శిస్తోందని తెలుగుదేశం ఎంపి లు గత కొన్ని రోజులుగా పార్లమెంట్ లోపల బయట నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే…ఈ రోజు కూడా పార్లమెంట్ ఆవరణలో ఎంపి లు ధర్నా చేపట్టారు..ఏపీకి న్యాయం చేయాలంటూ ప్లకార్డులతో ఆందోళన చేశారు…రోజుకో వేషం వేస్తూ అందరినీ ఆకర్షిస్తోన్న చిత్తూరు ఎంపి శివప్రసాద్ ఈ రోజు హిజ్రా వేషంలో కనిపించారు..

రోజూ వేషాలు వేసి నిరసన తెలియజేసినా ప్రధాని మనసు కరగలేదన్నారు శివప్రసాద్. అందుకే ఇప్పుడు ఈ వేషం వేయాల్సి వచ్చిందన్నారు. ‘మోదీ బావా.. మాటలెన్నో చెప్పావు.. చేతల్లో ఏమీ చూపించలేదు.. ప్రత్యేక హోదా ఇవ్వవా.. ఇదే అంతం ఆరంభం’ అంటూ చమత్కరించారు. మరోవైపు విచిత్ర వేషాలతో నిరసన తెలుపుతున్న శివప్రసాద్‌ను కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా, ఆ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌లు అభినందించారు. అప్పుడు కాంగ్రెస్ రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఇప్పుడు బిజెపి కూడా ఆ అన్యాయాన్ని పొడిగిస్తోందని అన్నారు తెలుగుదేశం ఎంపిలు..18 రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం కనీసం స్పందించకపోవడం దారుణమని ఎంపీలు మండిపడ్డారు. పార్లమెంట్‌లో కూడా అవకాశం వచ్చిన ప్రతిసారీ కేంద్రాన్ని నిలదీస్తున్నామని.. కాని ప్రధాని, కేంద్రమంత్రులు నిద్రపోతున్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. ఇలా నటించే వాళ్లను ఏమీ చేయలేమని.. కేంద్రం ఉలిక్కిపడేలా పిడుగులు పడతాయని హెచ్చరించారు.