బోటు ప్ర‌మాద‌ఘ‌ట‌న‌పై సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సీఎం జ‌గ‌న్

743

గ‌డిచిన ఐదు రోజులుగా అంద‌రూ గోదావ‌రిలో మునిగిపోయిన బోటు గురించి ఆలోచిస్తున్నారు.. ఆ ప‌డ‌వ ఆచూకి కోసం దాదాపు 700 మంది సిబ్బంది వెతుకుతున్నారు.. ఆ ప‌డ‌వ ఆచూకి తెలిసినా దానిని ఎవ‌రూ బ‌య‌ట‌కు తీసే సాహ‌సం చేయ‌లేక‌పోతున్నారు.. సుమారు 40 ట‌న్నుల బ‌రువు ఉండే ఆ బోటు బ‌య‌ట‌కు తీసేందుకు ఎంత టెక్నాల‌జీ వాడినా సుడులు తిరుగుతున్న న‌దిలో అది కుద‌ర‌నిది అని తేల్చేస్తున్నారు.ఈ బోటు ప్రమాదంలో పదుల సంఖ్యలో పర్యాటకులు మృత్యువాత పడ్డారు. మృతదేహాల కోసం గాలింపు నేటికీ కొనసాగుతూనే ఉంది. మరోపక్క ఘటనపై సీరియస్ గా ఉన్న జగన్ సర్కార్ ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది.

Image result for godavari


గోదావరిలో మునిగి పోయిన బోటు జాడ గుర్తించినప్పటికీ, దాదాపుగా మూడు వందల పదిహేను అడుగుల లోతులో ఉన్న బోటును బయటికి తీయడం కష్టమని విపత్తు నిర్వహణ సిబ్బంది తేల్చి చెప్పేశారు. గోదావరి ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా, సుడిగుండాల తో ఆటంకం ఎదురవుతున్న పరిస్థితుల్లో బోటును బయటకి తీయలేమని , బోటు బయటికి తీయడానికి కొద్దిరోజులపాటు ఆగాల్సిందేనని తేల్చేశారు. ఇప్పటికి కొందరి మృతదేహాలు లభించినప్పటికీ మరి కొందరు జలసమాధిలోనే ఉండిపోయారు. ఈరోజు మ‌రో మృత‌దేహం కూడా బ‌య‌ట‌కువ‌చ్చింది. అసలు ఘటనకు కారణమేంటి? ఘటన ఎలా జరిగింది? బాధ్యులెవరు? అన్న అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అవినీతి, బోటు నిర్వాహకుల పట్టింపులేని తనం వెరసి పర్యాటకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అయితే ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించిన ఏపీ సర్కార్ ఈ బోటు ప్రమాదం పై ఇక విచారణ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చైర్మన్ గా వ్యవహరిస్తారు.

ఈ క్రింద వీడియో చూడండి

కమిటీలో పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, రెవిన్యూ శాఖ చీఫ్ సెక్రటరీ, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లు సభ్యులుగా వ్యవహరిస్తారు. బోటు ప్రమాద ఘటనపై వీరి సమగ్ర దర్యాప్తు చేసి ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది? ఘటనకు పూర్తి బాధ్యత తీసుకోవాల్సిన వారెవరు ? అన్న అంశాలపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. త్వరలోనే ఈ ఘటనపై సమగ్ర విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తే ప్రమాద ఘటనకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటుంది.బోటును బయటకు తీయకుండా సమగ్ర దర్యాప్తు చేయడం సాధ్యం కాదు కాబట్టి, ఈ కమిటీ విచారణ పూర్తి నివేదిక బోటును బయటకు తీసిన తర్వాత మాత్రమే వెల్లడించే అవకాశం ఉంది. బోటు జాడ గుర్తించిన ముంబయ్ మెరైన్ నిపుణుడు సౌరవ్ భక్షి, కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం, మత్స్యకార బృందం ఆధ్వర్యంలో బోటును వెలికి తీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ బోటు వెలికితీత సాధ్యం కాలేదు. అందుకే కొద్ది రోజులు ఆగాలని చెప్తున్నారు. ఇప్పటి వరకు 35 మృతదేహాలను వెలికితీయగా మిగతా వారి మృతదేహాలు బోటులో ఉన్నట్టు భావిస్తున్నారు. దీనిపై ప్ర‌భుత్వం మాత్రం వెన‌క‌డుగు వేయ‌డం లేదు
నాలుగు రోజులుగా అన్నీ మార్గాల ద్వారా బోటును బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది.