ఆర్టీసీ కార్మికుల‌కి షాక్ కేసీఆర్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం

1272

తెలంగాణ‌లో ఐదోరోజు ఆర్టీసీ కార్మికులు స‌మ్మె చేస్తున్నారు, దీంతో ఆర్టీసీ వ్యవహారం రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఇప్పటికే ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేయడమే కాకుండా.. వారికి వైద్యాన్ని కూడా నిలిపివేసిన కేసీఆర్.. తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఆర్టీసీ కండక్టర్‌లు, డ్రైవర్ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కండక్టర్‌లు, డ్రైవర్ల నియామకానికి కసరత్తు చేయాలని… అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు డ్రైవర్‌లు, కండక్టర్ల నియామకంపై.. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ ఫైల్‌ను సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత కొత్త డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్‌మెంట్‌పై ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది. ఇక కేసీఆర్ మ‌రో కీల‌క నిర్ణ‌యం కూడా నిన్న తీసుకోవ‌డం జ‌రిగింది.

Related image

ప్రస్తుతం ఆర్టీసీలో 10,400 బస్సులున్నాయి. వీటిని భవిష్యత్‌లో మూడు రకాలుగా విభజించాలని నిర్ణయించారు. 50%(5200) బస్సులు ఆర్టీసీలో నడపనుండగా.. 30%(3100) అద్దె బస్సులు గాను, మరో 20%(2100) బస్సులను పూర్తి ప్రయివేటు బస్సులుగా నడపాలని సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ చార్జీలు, ప్రయివేట్ బస్సుల చార్జీలు సమానంగా ఉంటాయన్నారు. కాగా, ఇప్పటికీ 21% అద్దె బస్సులను ఆర్టీసీ నడుపుతోందని.. అదనంగా మరో 9% అద్దె బస్సులను పెంచితే ఆర్టీసీకి కొత్త బస్సులు వచ్చినట్లేనని ముఖ్యమంత్రి అన్నారు.

Related image

ఆర్టీసీ యూనియన్ల అతి ప్రవర్తన వల్లే ఈ చర్యలన్నీ చేపట్టాల్సి వచ్చిందని కేసీఆర్ స్పష్టం చేశారు. తాము ఎక్కిన చెట్టు కొమ్మను తామే నరుక్కున్నారని ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి సీఎం అన్నారు. సమ్మెను తీవ్రతరం చేస్తామనడం హాస్యాస్పదమని.. యూనియన్లు తీసుకునే అర్థరహితమైన నిర్ణయాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయమని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం దృష్టిలో, ఆర్టీసీ యాజమాన్యం దృష్టిలో ఆర్టీసీ సిబ్బంది 1200 మాత్రమే ఉన్నారని మరోసారి ఆయన గుర్తు చేశారు. ఇకపోతే సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను డిస్మిస్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని.. వాళ్ళంతట వాళ్ళే తప్పుకున్నారని… గడువులోపల విధుల్లోకి చేరనివాళ్ళు “సెల్ఫ్ డిస్మిస్” అయ్యారని వెల్లడించారు. అంతేకాక తొలగిపోయిన వాళ్ళు డిపోల దగ్గర కానీ, బస్ స్టేషన్ల దగ్గర కానీ గొడవ చేయకుండా ప్రత్యేక పోలీసు బృందాలను చేస్తామన్నారు. సబ్సిడీ బస్‌పాస్‌లు ఇకముందు కూడా ఎదావిధిగా కొనసాగుతాయని సీఎం చెప్పారు. ఇకపై ఆర్టీసీలో యూనియన్ల ప్రసక్తే ఉండదని సీఎం తేల్చి చెప్పారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఆర్టీసీకి కొత్త నెత్తురు, జవసత్వాలు రావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. భవిష్యత్‌లో యూనియనిజం అనేది ఇకపై ఆర్టీసీలో ఉండబోదని.. సంస్థ అద్భుతంగా రూపుదిద్దుకుని లాభాల బాట పట్టేలా కృషి చేస్తామన్నారు. అంతేకాక కార్మికులకు బోనస్ ఇచ్చే పరిస్థితి కూడా త్వరలోనే వస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. పండగ సీజన్‌లో ప్రజలను ఇబ్బందులకు గురి చేసే రీతిలో ఇష్టం వచ్చినట్లుగా సమ్మెకు దిగడం దురహంకారమని ఆయన మండిపడ్డారు. మ‌రి ఈ నిర్ణ‌యాల‌పై ఉద్యోగులు మాత్రం వెన‌క్కి త‌గ్గేది లేదు అంటున్నారు.