కోడెల మరణించిన వెంటనే కేసీఆర్ ఏమన్నారంటే

1272

కాసేపటి క్రితం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఆంధ్రప్రదేశ్ మాజీ స్పికర్ కోడెల శివప్రసాద్ మృతిపట్ల తెలంగాణ సీఎం కేసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా ఆయన కుటుంభ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు.

Image result for kcr

మరోవైపు కొడెలతో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సంధర్భంగా గుర్తు చేసుకున్నారు.ఇక మాజీ స్పీకర్ మృతిపట్ల తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డితోపాటు,మంత్రి కేటిఆర్‌లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కు చెందిన మాజీ మంత్రి కడియం శ్రీహారి బసవతారకం ఆసుపత్రికి చేరుకుని, కొడెల కుటుంభసభ్యులను పరామర్శించారు.

ఈ క్రింద వీడియో చూడండి

కాగా ఉదయం హైదరాబాద్‌లోని ఆయన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో హుటాహుటిన బసవతారం ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చికిత్స పోందుతూ మధ్యహ్నాం 12 గంటలకు మృతి చెందినట్టు ఆసుపత్రి వైద్యులు ధృవికరించారు.