ఏపీ పోలీసుల‌కు స్వీట్ న్యూస్ చెప్పిన సీఎం జ‌గ‌న్

731

ఏపీలో ఇప్పుడు కొత్త‌గా ఉద్యోగాల జాత‌ర‌ క‌నిపిస్తోంది, పెద్ద సంఖ్య‌లో ఉద్యోగాలు వ‌స్తున్నాయి. అలాగే నిరుద్యోగులు కూడా నోటిఫికేష‌న్ల‌తో చ‌దువుల‌పైనే కాన్స‌న్ట్రేష‌న్ పెడుతున్నారు..ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి తీసుకోనటువంటి సంచలన నిర్ణయం తీసుకొని ఆంధ్ర ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒకొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు.

Image result for ap police

ఏ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చరు. ఎన్నికలు వచ్చేస‌రికి ఇంకా 5 ఏళ్ళు ఉంది. ముందు ఈ మూడు సంవత్సరాలు బాగా లాగి తర్వాత కొన్ని హామీలు నెరవేరుద్దాంలే అనుకునే వారు. కానీ ఇప్పుడు ఉన్న మన యువ ముఖ్యమంత్రి జగన్ ఆలా కాదు.. ఇచ్చిన హామీలను త్వరగా నెరవేర్చాలి.. ప్రజల కోరిక తీర్చాలి.. ఆంధ్రాని అభివృద్ధి వైపు నడిపించాలి అని అనుకుంటున్నారు సీఎం జగన్. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలు ఒకొక్కటిగా నెరవేరుస్తున్నారు. నాలుగు నెలల పాలనలోనే 4 లక్షల మందికి ఉద్యోగాలు కలిపించి రికార్డు సృష్టించారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఆశా వర్కర్లకు జీతాల భారీగా పెంచడు, ట్యాక్సీ, ఆటోలు నడుపుకొనే వారికీ ఆర్థిక సహాయం వంటి ఎన్నెన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు సీఎం జగన్. ఈ నేపథ్యంలోనే తాజాగా హోంగార్డులకు శుభవార్త చెప్పారు సీఎం జగన్. హోంగార్డుల జీతాన్ని రూ. 18 వేల నుంచి 21,300 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎం జగన్. దీంతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ అంటూ జగన్ కు ప్రశంశిస్తున్నారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ తమకు వేతనాన్ని పెంచారంటూ రాష్ట్ర పోలీసు సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఏది ఏమైతేనేం తండ్రి రాజన్న రాజ్యాన్ని గుర్తు చేస్తున్నారు సీఎం జగన్ అని ప్రశంస‌లు వ‌స్తున్నాయి. ఇంకా సంవ‌త్స‌రం కాకుండానే జ‌గ‌న్ ఇన్ని ప‌థకాలు అమ‌లు చేస్తుంటే , ఎన్నిక‌ల ముందు ఇంకెంత బాగా పాల‌న చేస్తారా? ఇంకా మ‌రెన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తారో అని చ‌ర్చించుకుంటున్నారు జ‌నం.

ఈ క్రింద వీడియో చూడండి