టీడీపీ ఎంపీల‌కు సీక్రెట్ చెప్పిన సీఎం చంద్ర‌బాబు

446

పార్ల‌మెంట్లో అనుకున్న విధంగా అవిశ్వాస తీర్మాణం పై చ‌ర్చ విష‌యంలో స‌క్సెస్ అయింది తెలుగుదేశం… దీంతో తెలుగుదేశం మ‌రో మైలు రాయిని రీచ్ అయిన‌ట్లే చెప్పాలి… 15 సంవ‌త్స‌రాల నుంచి చ‌ర్చ‌కు రాని అవిశ్వాసం ఈనాడు మ‌ళ్లీ చ‌ర్చ‌కు వ‌చ్చేలా తెలుగుదేశం చేసింది….పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ పోరాటం భావి తరాల కోసమేనన్న విషయం అందరికీ స్పష్టం కావాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.. ఎట్టి ప‌రిస్దితుల్లో వెన‌క‌డుగు వేసే ప్ర‌స‌క్తేలేద‌ని ఆయ‌న అన్నారు.

Image result for chandra babu

ఎంపీల‌ను స‌భ నుంచి స‌స్పెండ్ చేసినా వెన‌క‌డుగు వేయ‌వ‌ద్దని సీఎం చంద్ర‌బాబు ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు..తాను దిల్లీ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటానని…, ఒక లక్ష్యం కోసం చేస్తున్న పోరాటానికి అందరి మద్దతు కూడగట్టాలని సూచించారు… పార్టీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఎంపీల‌కు ఎటువంటి స్ట్రాట‌జీల‌తో ముందుకు వెళ్లాలో తెలియ‌చేశారు. ఇక్క‌డ ప్ర‌తిప‌క్ష పార్టీ గురించి మ‌రిచిపోవాల‌ని మీరు ప్ర‌త్యేక హోదా అంశాన్ని క‌చ్చితంగా వ‌ద‌ల‌కూడ‌దు అని తెలియ‌చేశారు..

Related image

మాజీ ఎంపీ ఉండవల్లితో జరిపిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి వారికి వివరించారు. అన్యాయం చక్కదిద్దుతామని చెప్పిన బీజేపీ ..ఇప్పుడు అన్యాయం చేయటం మోసమేనని సీఎం వారితో అన్నారు… ప్రజాకోర్టులో వారిని దోషులుగా నిలబెట్టాలని… ఏ పార్టీలు మద్దతిస్తాయో ప్రజలే చూస్తారన్నారు. టీడీపీ ప్ర‌జ‌ల పార్టీ ఇటువంటి విష‌యాల‌లో వెన‌కంజు వేయ‌దు అని అన్నారు ఆయ‌న‌.