సీఎం చంద్ర‌బాబు కిడారి ఫ్యామిలీకి హామీ

289

ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు అడక్కుండానే ఆర్థిక సాయం, గ్రేడ్-1 ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్ తెలియ‌చేశారు.. కిడారి కుటుంబాన్ని పరామర్శించారు సీఎం చంద్ర‌బాబు.. ఆ కుటుంబాన్ని అన్నివిధాల అండగా ఉంటామని, ఆదుకుంటామని చెప్పారు. కోటి రూపాయల ఆర్థిక సాయం, ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కిడారి పెద్ద కుమారుడు శ్రావణ్ త‌మ‌కు సీఎం చంద్ర‌బాబు ఇచ్చిన హామీ పై ఆయ‌న ఆనందం వ్య‌క్తం చేశారు.

 వేడుకున్న కిడారి, అవకాశాలిచ్చాం.. ఇక చాలు

తమ కుటుంబానికి, నియోజకవర్గానికి, కార్యకర్తలకు అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారని, అదే తమకు కొండంత అండని శ్రావణ్ అన్నారు. రాజకీయ వారసత్వాన్ని కొనసాగించబోతున్నారా? అన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా.. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అన్నారు. పార్టీ తరఫున అన్నీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, తనకు రాజకీయాల్లోకి రావాలని లేకపోయినా, ప్రస్తుత అవసరాన్ని బట్టి తమ నియోజక వర్గ ప్రజలకు అండ ఉండాలి కాబట్టి… చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని శ్రావణ్ మరోసారి స్పష్టం చేశారు. మొత్తానికి ఆయ‌న పెద్ద కుమారుడు రాజీక‌యాల్లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది, ఇక చిన్న‌వ‌య‌సులో కిడారి చ‌నిపోవ‌డంతో, వారికి తండ్రి లేక‌పోవ‌డంతో ఇప్పుడు జిల్లా టీడీపీ నాయ‌కుల‌కు వారికి ఎటువంటి అవ‌స‌రం వచ్చినా చూసుకోవాలి అని తెలియ‌చేశారు సీఎం చంద్ర‌బాబు.