ఇద్ద‌రు మంత్రుల‌కు బాబు లైన్ క్లియ‌ర్

311

తెలుగుదేశం పార్టీలో ఇద్ద‌రు మంత్రుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కూ చంద్రబాబు సీటు విష‌యంలో డైల‌మాలో ఉన్నారు.. కాని తాజాగా వారికి కూడా సీటు విష‌యంలో ఓ క్లారిటీకి వ‌చ్చారు అని తెలుస్తోంది. అయితే ఒక‌రు మంత్రి నారాయ‌ణ మ‌రో మంత్రి కాల్వ‌శ్రీనివాసులు, నారాయ‌ణ నెల్లూరు నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు, కాల్వ మంత్రిగా ఎమ్మెల్యేగా గెలిచి అనంత‌పురం జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరికి కోరిన సెగ్మెంట్లు కావాల‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో అక్క‌డ నుంచి పోటికి చంద్ర‌బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అని కోరారు, కాని వీరికి బాబు ఎటువంటి ఆమోద‌ముద్ర వేయలేదు తాజాగా వీరికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు అని తెలుస్తోంది.

Image result for కాల్వ‌శ్రీనివాసులు

పురపాలక మంత్రి పి.నారాయణ నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయడానికి పార్టీ నాయకత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయనకు ఇప్పటివరకూ నియోజకవర్గం లేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈసారి ఆయన్ను నెల్లూరు సిటీ నుంచి బరిలోకి దింపాలని నాయకత్వం నిర్ణయం తీసుకుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

Image result for minister narayana

ఇక సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కాల్వ శ్రీనివాసులు తన సొంత నియోజకవర్గం రాయదుర్గం నుంచే మళ్లీ పోటీ చేస్తారని ఖరారైంది. దీంతో వీరిద్ద‌రికి ఇక సెగ్మెంట్ల విష‌యంలో మరో ఆలోచన వద్దు అని చంద్ర‌బాబు తెలియ‌చేశార‌ట‌. ఎన్నిక‌ల స‌మ‌యానికి మ‌రింత స‌మాయ‌త్తం అవ్వాల‌ని తెలిపార‌ట సీఎం చంద్ర‌బాబు.