నాగబాబు జనసేనలో జాయిన్ అవ్వడం మీద చిరంజీవి ఏమని కామెంట్ చేశాడో తెలిస్తే షాక్..

261

సినీ నటుడు కొణిదెల నాగేంద్రబాబు (నాగబాబు) జనసేనలో చేరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో తమ్ముడు పవన్‌కల్యాణ్ సమక్షంలో బుధవారం జనసేన కండువా కప్పుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున నాగబాబును బరిలో దింపుతున్నట్టు పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ చెప్పారు. పార్టీలో చేరిన వెంటనే ఆయనకు బీ-ఫారాన్ని అందజేశారు. దొడ్డిదారిలో కాకుండా ధైర్యం గా తన అన్నయ్యను నేరుగా ప్రజాక్షేత్రంలో నిలబెడుతున్నానని పవన్ తెలిపారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి నాగబాబు అని పేర్కొన్నారు. వరుసకు తమ్ముడే అయినా తనకు కూడా పవన్ నాయకుడేనని నాగబాబు అన్నారు.

పార్టీలో చేరక ముందే పవన్‌ కోసం ఏ పని చేయడానికైనా సిద్ధమయ్యానని, తమ్ముడు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళతానని స్పష్టం చేశారు. టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీచేయాలని భావించినప్పటికీ కొని కారణాల వల్ల అది వీలుకాలేదు. కానీ, ఇప్పుడు తమ్ముడితో నాగబాబు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.అలాగే ఈరోజు జనసేన తన మిగతా అభ్యర్థులను కూడా నిలబెట్టబోతుంది. మొత్తం 175 స్థానాలలో జనసేన నిలబడబోతుంది. అందులో 21 స్థానాల్లో BSP పార్టీ 14 స్థానాల్లో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు నిలబడబోతున్నారు. తెలంగాణాలో కూడా ఎంపీ స్థానాలకు పోటీ చెయ్యబోతున్నాడు.

Image result for naga babu join to janasena

అయితే నాగబాబు జాయిన్ అవ్వడం మీద చిరంజీవి సంతోషం వ్యక్తం చేశాడంట. తమ్ముళ్ల ఎదుగుదల చూసి చిరంజీవి గర్వంగా ఫీల్ అవుతున్నాడంట. ఇద్దరు తమ్ముళ్లకు నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా. గతంలో నేను పార్టీ పెట్టినప్పుడు జరిగిన పొరబాట్లు జనసేనలో జరగకుండా చూసుకోవాలి. ప్రజలకు సేవ చెయ్యాలి. అంతేకాని ఎలాంటి స్వలాభాలకు ఆశించకుండా ప్రజాసేవ గురించే ఆలోచించాలి అని ఇద్దరు తమ్ముళ్లను ఆశీర్వదించాడు. చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలలో లేడు. కాబట్టి అన్నయ్య సపోర్ట్ తమ్ముళ్లకు ఎప్పుడు ఉంటుంది. అలాగే మెగా హీరోలందరూ కలిసి ప్రచారం చేస్తే పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా కొంచెం మేలు జరిగే అవకాశం ఉంది. చూడాలి మరి పవన్ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాడో లేదో. మరి నాగబాబు జనసేనలో జాయిన్ అవ్వడం గురించి చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.