జ‌న‌సేనాకి ట్యూట‌ర్ గా చింత‌మ‌నేని

275

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌ట‌న‌తో బిజీగా ఉన్నారు.. ఇప్పుడు ఆ పార్టీ రాజ‌కీయం గ‌రం గ‌రంగా మారింది. దెందులూరులో ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ పై ప‌వ‌న్ క‌ల్యాణ తీవ్ర స్ధాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఇక వీటికి ధీటుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ పై దెందులూరు ఎమ్మెల్యే తీవ్ర స్ధాయిలో విమ‌ర్శ‌ల బాణాలు వ‌దిలారు.. ప‌వ‌న్ నీ స్ధాయి నువ్వే త‌గ్గించుకుంటున్నావు అని విమ‌ర్శించారు చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్.

Image result for pawan kalyan and chintamaneni prabhakara

తనపై చేసిన ఆరోపణలపై ఎన్ని కమిటీలు అయినా వేసుకొని నిరూపించాలని సవాల్‌ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ ఓ గల్లీ నాయకుడి స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను రాజ్యాంగ శక్తి ఎదుగుతున్నానని చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్‌ చేశారు. తనను రౌడీ షీటర్‌ అని పవన్‌ చెప్పాల్సిన అవసరం లేదని, తానేంటో దెందులూరు ప్రజలకు తెలుసన్నారు. నాణానికి ఒక వైపే చూస్తున్నారని రెండో వైపు​ చూస్తే పవన్‌ తట్టుకోలేరని హెచ్చరించారు.

Related image

నియోజక వర్గం అభివృద్ధిపై ఒక్క కామెంట్‌ చేయలేకనే వ్యక్తిగతంగా విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడితే పవన్‌ కల్యాణ్‌ మూడు రోజుల అన్నం తినడం మానేస్తాడని ఎద్దేవా చేశారు. పవన్‌కు దమ్ముంటే దెందులూరులో తనపై పోటీ చేసి గెలవాలి సవాల్‌ చేశారు. తాను అభినంద‌న స‌భ పెడ‌తాను అని ఇలా ఎవ‌రో ఇచ్చిన పేప‌ర్లు స్క్రిప్ట్ ఇస్తే చ‌ద‌వ‌డం స‌రైన రాజ‌కీయం కాదు అని విమ‌ర్శించారు. మ‌రి కొత్త‌గా ట్యూష‌న్ టీచ‌ర్ ని ప‌వ‌న్ పెట్టుకుంటే బెట‌ర్ అని తాను అయినా ప‌వ‌న్ కి ట్యూష‌న్ చెబుతా అని అన్నారు ఆయ‌న‌. ఇక త‌న పై ఆరోప‌ణ‌లు చేసిన‌వి వాస్త‌వాలు కాదు అని కొట్టిపారేశారు.