చిరంజీవి, ప‌వ‌న్ పై చింత‌మ‌నేని సంచ‌ల‌న కామెంట్లు

470

ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టి త‌ర్వాత కాంగ్రెస్ లో క‌లిపేశారు చిరంజీవి.. కేంద్ర‌మంత్రిగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ఉండేవారు… యూపీఏ ప్ర‌భుత్వం కేంద్రం నుంచి దిగిపోయిన త‌ర్వాత, ఆయ‌న రాజ్య‌స‌భ మెంబర్ గా మాత్ర‌మే కొన‌సాగారు. ఇక చిరంజీవి ఇప్పుడు సినిమాల‌తోనే బిజీగా ఉన్నారు… జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, సొంతంగా పార్టీ పెట్టి ఇప్పుడు ఎదుగుతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ నిప్పులు చెరిగారు చిరంజీవి పై అలాగే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై.

Image result for pawan and chiranjeevi

ఆంధ్రప్రదేశ్ విడిపోవడాకి మొదటి ముద్దాయి చిరంజీవే అని, ఏలూరు మండలం మాదేపల్లి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ కోసం కాపు సోదరులు ఆస్తులు అమ్మి మద్దతు ఇస్తే వాళ్లను బలి పశువు చేసింది చిరంజీవి కాదా అని మండిపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని బంగాళాఖాతంలో కలిపిన ఘనత చిరంజీవిదేనని ఎద్దేవా చేశారు.

Image result for chintamaneni

చిరంజీవి నాడు చేసిన ప‌నికి కాపులు ఇప్ప‌టికీ చ‌ర్చించుకుంటారు అని ఆయ‌న విమ‌ర్శించారు.. మీరు ఇన్ని మాట‌లు మాట్లాడుతున్నారు చిరంజీవి ఇంత ద్రోహం చేశారు ఎందుకు అడ‌గ‌లేక‌పోతున్నారు అని ఆయ‌న ప్ర‌శ్నించారు. చిరంజీవిని ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేదు? ఇలా ప్ర‌శ్నించడానికి ర‌క్త‌సంబంధం అడ్డువ‌స్తుందా అని అన్నారు.. ఆ స‌మ‌యంలో మీ అన్న పార్టీ నువ్వు తీసుకుని ప్ర‌జారాజ్యం న‌డ‌ప‌చ్చుక‌దా ఇప్పుడు జ‌న‌సేన అనే పార్టీ ఎందుకు పెట్టావు అని నిప్పులు చెరిగారు… పవన్‌ కల్యాణ్‌ నీ ఫ్యాన్స్‌ రెచ్చిపోతున్నారు.

Image result for pawan and chiranjeevi

నన్ను ఓడించి, జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపిస్తానని ఊగిపోతున్నారు.. మీరు కాదు మీ జేజేమ్మలు దిగొచ్చినా నన్ను ఓడించలేరు అంటూ చింతమనేని తీవ్రస్థాయిలో మండిపడ్డారు… ఇక్క‌డ పొలిటిక‌ల్ వార్ పెరిగిపోతోంది.. వైసీపీ త‌ర‌పున అబ్బ‌య్య‌చౌద‌రి తెలుగుదేశం త‌ర‌పున మాగంటి ఫ్యామిలీ లేదా చింత‌మ‌నేని నిల‌బ‌డ‌టానికి టికెట్ కోసం చూస్తున్నారు. మ‌రి జ‌న‌సేన త‌ర‌పున ఎవ‌రో చూడాలి దెందులూరులో.