చంద్ర‌న్న పెళ్లికానుక‌పై విమ‌ర్శ‌లు

379

తెలుగుదేశం పార్టీ ప్ర‌వేశ‌పెట్టే ప‌థ‌కాలు ఎలా ఉన్నా కొన్ని విమ‌ర్శ‌లు పాల‌వుతున్నాయి.. ముఖ్యంగా ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశం చంద్ర‌న్న పెళ్లికానుక‌.. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మ‌హిళ‌ల వివాహ స‌మ‌యంలో ఆ పెళ్లి చేసుకునే అమ్మాయిల‌కు కొంత మొత్తాన్ని తెలుగుదేశం స‌ర్కారు బ్యాంకుల్లో జ‌మ‌చేసి, వారికి ఆర్ధికంగా భ‌రోసా క‌ల్పిస్తోంది… ఈ చంద్ర‌న్న పెళ్లి కానుక ముఖ్య ఉద్దేశం కూడా అదే.

Image result for chandranna pelli kanuka

అయితే ఇప్పటివరకూ వున్న ప్రకారం , ఎస్సి,ఎస్టీ మైనార్టీ మహిళకు గాని పెళ్లి కుదిరితే, అక్కడి నుండి పెళ్లిజరగడానికి నెలరోజుల ముందు నుండిగాని, పెళ్లిరోజు వరకు గాని, లేదా పెళ్లి అయ్యాక రెండునెలల వరకు గాని ఆ ఆ పధకం క్రింద దరఖాస్తు చేసుకోవడానికి వీలుండేది. ఆ పై మహిళ తెల్ల రేషన్ కార్డు కలిగిఉంటే, వెంటనేఆ సొమ్ము ఆ మహిళా ఖాతాలో జమ అయ్యేది. కానీ ప్రస్తుతం అమలవుతున్న కొన్ని మార్పులు చేయబడిన పద్దతుల వల్ల ఈ పధకానికి విమర్శల వెల్లువ ఎక్కువవుతున్నట్లు తెలుస్తోంది.

Image result for chandranna pelli kanuka

ఈ ప‌థ‌కం ఇక‌పై వ‌ర్తించాలి అంటే ఇద్ద‌రికి తెల్ల‌కార్డు ఉండాలి అని, అలాగే పెళ్లికి 15 రోజుల ముందు ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి అని, అప్ప‌టికే పెళ్లి ప‌త్రిక రెడీగా ఉండాలి అనేలా కొన్ని కొత్త కండిష‌న్లు పెట్టారు.. ఇలా ష‌ర‌తుల‌తో ఆడ‌పిల్ల‌ల‌కు పెళ్లికానుక దూరం అవుతోంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక మూడు నెల‌లు అయినా ఇలా అప్లై చేసిన వారికి న‌గ‌దు జ‌మ అవ్వ‌లేదు అని కొంద‌రు అంటున్నారు.. ఇక వెబ్ సైట్ కొన్ని రోజులుగా ప‌నిచేయ‌డం లేద‌ని, దీనిని స‌ర్కారు ప‌ట్టించుకోవ‌డం లేదు అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.. మ‌రి చూడాలి అధికార పార్టీ దీనిపై ఎటువంటి దృష్టి పెడుతుందో.