తెలంగాణ ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబు సంచలన నిర్ణయం

473

ఈవీఎంలు ఓపెన్ అయ్యాయి. ఫలితాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. మొత్తంగా గాలి ఎటు వీస్తుందన్న విషయం మీద క్లారిటీ వచ్చేసింది. ఇప్పటివరకూ ఉన్న ఆశ‌లు అన్నీ ఆ పార్టీకి ఆవిరి అయిపోయాయి ఇంత‌కీ ఏ పార్టీ అని అనుకుంటున్నారా అదే పార్టీ కూట‌మి పార్టీ. ఇటు తెలంగాణ ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పుతో తెలంగాణలో విజయం కారుదేనని తేలిపోయింది. తెలంగాణ రాజు కేసీఆరేనన్నది కచ్ఛితమైంది. పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు గట్టి పోటీ ఇచ్చిన కూటమి చిత్తుగా ఓడిపోతున్న వైనం తాజాగా వెల్లడవుతున్న ఫలితాల్ని చూస్తే అర్థమయ్యే పరిస్థితి.

Image result for chandra babu

లాంటివేళ.. సోషల్ మీడియాలో పదునైన ట్వీట్ చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత.. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. తాజాగా ఆయన చేసి ట్వీట్ ఆసక్తికరంగానే కాదు సంచలనంగా మారింది. తెలంగాణలో కూటమి ఓటమికి చంద్రబాబు అన్న విషయాన్ని ఆయన సూటిగా చెప్పేశారు. మీడియా.. డబ్బుతో ఏదైనా చేయొచ్చన్న భ్రమలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటారన్న ఆయన.. మీడియా.. నమ్ముకున్న నోట్ల కట్టలు గెలిపించలేవంటూ విమర్శించారు.

Image result for chandra babu

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బాబు వ్యవహారశైలిని తాజా మాజీ మంత్రి కేటీఆర్ చక్కగా విశ్లేషించారన్న విజయసాయి రెడ్డి.. తాచెడ్డ కోతి వనమెల్ల చెడగొట్టినట్లు తెలంగాణ కాంగ్రెస్ను నిండా ముంచుతున్నాడు పెద్ద నాయుడు అంటూ ట్వీట్ తో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో తమ విజయం గురించి కేటీఆర్ చేసిన విశ్లేషణను విజయసాయి గుర్తు చేసుకున్నారు. టీఆర్ ఎస్ వంద సీట్లు గెలుచుకుంటుందని.. కాంగ్రెస్ హేమాహేమీలు ఓడిపోనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థులుగా చెప్పుకునే వారు.. తమ తమ సొంత నియోజకవర్గాల్ని సైతం దాటలేదని ఎద్దేవా చేసిన కేటీఆర్..

ఈ క్రింద వీడియో మీరు చూడండి

తాము ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నామని.. 11న టీఆర్ ఎస్ విజయోత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆయన చెప్పినట్లే జరుగుతుండటం తో ఇప్ప‌డు సీన్ కారు స్పీడుని స్ప‌ష్టంగా చూపించింది. ఇక తెలంగాణ‌లో కావాల‌నే కాంగ్రెస్ కూట‌మిని తెలుగుదేశం పార్టీ ని ప్ర‌జ‌లు వెలివేశారు అని ఇక్క‌డ నేత‌లు చెబుతున్నారు. చంద్ర‌బాబు కూట‌మితో చేతులు క‌లిపారు లేక‌పోతే 50 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వ‌చ్చేవి అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక చంద్ర‌బాబు తెలుగుదేశం పార్టీని తెలంగాణాలో మూసేయాల‌ని ఇక్క‌డ ఉన్నా 13 మంది లీడ‌ర్ల‌తో 90 మంది టీఆర్ఎస్ నేత‌ల‌ను ఎదుర్కోవ‌డం క‌ష్టం అని చెబుతున్నారు. అందుకే చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటే మంచిది అని చెబుతున్నారు టీఆర్ఎస్ నేత‌లు. మ‌రి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.