నాన్ బెయిల‌బుల్ వారెంట్ పై బాబు స్పంద‌న

367

బాబ్లీ ప్రాజెక్ట్ వ్య‌వ‌హారంలో సీఎం చంద్ర‌బాబుకు నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ ఇవ్వ‌డం పై , ఏపీలో హాట్ టాపిక్ అయింది ఈ విష‌యం. దీనిపై తెలుగుదేశం నాయ‌కులు ప‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. ఈ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ పై తెలుగుదేశం నాయ‌కుల స్పంద‌న నిన్న‌టి నుంచి చూస్తునే ఉన్నాము, తాజాగా దీనిపై సీఎం చంద్ర‌బాబు స్పందించారు.

Image result for chandra babu sad face

ఆరోజుల్లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడాను. ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందని పోరాటం చేశాను. కానీ బాబ్లీ కేసులో నాకు నోటీలిచ్చామని అంటున్నారు. నేను నేరం చేయలేదు.. ఘోరాలు చేయలేదు.. అన్యాయం అస్సలే చేయలేదు. ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందని బాబ్లీని వ్యతిరేకించాను. నేనేం తప్పు చేయలేదు.. ఏం చేస్తారో చేయండి అని ఆ రోజే పోలీసులకు చెప్పాను. ఇప్పుడు నోటీసులు.. అరెస్ట్ వారెంట్లు అంటున్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసమే పనిచేస్తాను. ఏ రాజకీయ పార్టీ వల్ల ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చిందో ఆలోచించాలి అని ఈ సందర్భంగా బాబు చెప్పుకొచ్చారు. సీఎం చంద్ర‌బాబు.

Image result for chandra babu sad face

ఇక ఆ నాడు ఏపీ – తెలంగాణ కలిసి ఉన్నాయి ఆ స‌మ‌యంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న వ‌ల్ల తెలుగుదేశం నేత‌లు అటువైపు ఇటువైపు ఉన్న నాయ‌కుల‌పై కేసు న‌మోదు అయింది… అయితే ఈ కేసుపై నోటీసులు రావ‌డం పై టీడీపీ న్యాయ‌స‌ల‌హాలు కూడా తీసుకుంటోంది. ఇలాంటి విష‌యాల్లో ఆచితూచి అడుగులు వేయ‌డంతో టీడీపీ దిట్ట అనే విష‌యం తెలిసిందే.