ప్ర‌ణ‌య్ హ‌త్య‌పై చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే?

352

మిర్యాల‌గూడ‌లో జ‌రిగిన ప్ర‌ణయ్ హ‌త్య పై రాజ‌కీయ నేత‌లు అంద‌రూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.. ముఖ్యంగా ఇలాంటి కుల హ‌త్య‌లు ఎవ‌రూ స‌హించ‌రు అని ఇలాంటివి స‌మాజంలో ఉండ‌కూడదు అని నేత‌లు తెలియ‌చేస్తున్నారు… దీనిపై ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న ఆవేద‌న తెలియ‌చేశారు. కులాలకతీతంగా పెళ్లిళ్లు జరిపించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందన్నారు. అహంభావంతో చంపించే పరిస్థితికి దిగజారడం బాధాకరమన్నారు.

Image result for pranay and amrutha

పెళ్లికానుక తేవడంలో ముఖ్య ఉద్దేశం కులాంతర వివాహాలను ప్రొత్సహించడమేనని ఆయన అన్నారు. పెళ్లికానుక విషయంలో కులాంతర వివాహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఇలాంటి దాడులు హ‌త్య‌లు అమానుషం అని ఆయ‌న అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.మిర్యాలగూడలో ఇద్దరు కులాంతర వివాహం చేసుకుంటే తక్కువ కులం అనే ఉద్దేశంతో యువతి తండ్రే చంపించాడంటే.. సమాజంలో ఎంత మూఢనమ్మకం, అహంకారం ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు.

Image result for CHANDRA BABU

అబ్బాయి మంచివాడు అయినప్పుడు, అమ్మాయి నచ్చినప్పుడు, పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటామని భావించినప్పుడు తల్లిదండ్రులు వాళ్లను ఆశీర్వదించాలని చంద్రబాబు అన్నారు…ఇలాంటి దారుణాల‌కు పాల్ప‌డితే వారికి శిక్ష విధించాల‌ని, మ‌రోసారి ఇలాంటి దారుణాల‌కు పాల్ప‌డ‌కుండా ఉండేలా అంద‌రికి గుణ‌పాఠం అవ్వాల‌ని చెప్పారు, ఒక‌వేళ ఆ పెళ్లి ఇష్టం లేక‌పోతే వాళ్లని వదిలేయాలన్నారు….అంతేకాని దారుణంగా చంపించడంవల్ల అతను సాధించిందేమీ లేదని చంద్రబాబు అసెంబ్లీ స‌మావేశంలో తెలియ‌చేశారు.