బాబుకు నోటీసులు అరెస్ట్ వారెంట్ జారీ

418

కేంద్రం ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడిపై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోందా, సీఎం చంద్ర‌బాబు పై ప‌క్కాగా ఫోక‌స్ పెట్టిందా, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై ఫోక‌స్ వల్లే ఇప్పుడు కోర్టు నోటీసులు ఆయ‌న‌కు వ‌చ్చాయా, మహారాష్ట్ర‌లోని ధ‌ర్మాబాద్ కోర్టు సీఎం చంద్ర‌బాబుకు సాగునీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావులకు అరెస్టు వారెంట్‌ జారీచేసింది. 2010లో అనుమతి లేకుండా బాబ్లీ ప్రాజెక్టును సందర్శించిన కేసులో చంద్రబాబు సహా మరో 15 మంది తెలుగుదేశం పార్టీ నేతలకు అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. వీరిలో తెలంగాణ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు కూడా ఉన్నారు.

Image result for chandra babu sad face

ఇక 2010 లో మ‌హారాష్ట్ర‌లోని గోదావ‌రి న‌దిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ విష‌యంలో వివాదం వ‌చ్చింది… ఈ స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న చంద్ర‌బాబు అక్క‌డ పెద్ద సంఖ్య‌లో నాయ‌కుల‌తో అనుమ‌తి లేకుండా ప్రాజెక్ట్ ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. ఇప్పుడు ఎనిమిది సంవత్స‌రాల త‌ర్వాత మ‌ళ్లీ ఈ కేసు విష‌యంలో నోటీసులు రావ‌డం పై, టీడీపీ నాయ‌కులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.. కావాల‌నే తెలుగుదేశం పై సీఎం చంద్ర‌బాబు పై ఇటువంటి రాజ‌కీయ కుయుక్తులు బీజేపీ ప‌న్నుతోంది అని విమ్శిస్తున్నారు.

Image result for chandra babu sad face

2010లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు.. టీడీపీ నేతలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా బాబ్లీ ప్రాజెక్టును సందర్శించారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఈ కేసు అప్పటి నుంచి విచారణలో ఉంది. ఎనిమిది సంవ‌త్స‌రాల్లో, ఒక్క‌సారి కూడా నోటీసులు అందుకోని ఈ నాయ‌కుల‌కు తాజాగా నోటీసులు రావ‌డం పై స‌ర్వ‌త్రా ఆలోచ‌న అయితే మొద‌లైంది..