బాబాయ్ మ‌ర‌ణంతో రంగంలోకి జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న చంద్ర‌బాబు

265

వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. పులివెందులలోని స్వగృహంలోనే ఆయన గుండెపోటుతో కుప్పకూలినట్లు తెలిసింది. తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్టు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వివేకానందరెడ్డి సొంత తమ్ముడు. ఆయన అకాల మరణం వైసీపీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేసింది. వైఎస్ వివేకాకు ఒక కుమార్తె ఉంది. వైఎస్ వివేకా ఆగస్ట్ 8, 1950న ఆయన జన్మించారు. వైఎస్ వివేకానందరెడ్డి సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగారు. ఆయన గతంలో కడప లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు పోటీ చేశారు. పులివెందుల నుంచి 1989, 1994లో వైఎస్ వివేకా ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Image result for chandra babu shock

వైఎస్ మరణానంతరం ఏర్పడిన కిరణ్ కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. పులివెందులకు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఆయన వదిన విజయమ్మ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం విభేదాలకు స్వస్తి పలికి కుటుంబానికి దగ్గరయ్యారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ తరపున ఆయన పులివెందులలో నిన్న ప్రచారం కూడా చేసినట్లు తెలిసింది. ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించారని మార్చి 3వ తేదీన వైఎస్ వివేకా పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఆయన హఠాన్మరణంతో జగన్ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. హుటాహుటిన లోటస్‌పాండ్ నుంచి పులివెందులకు జగన్ కుటుంబ సభ్యులు బయల్దేరారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతి పై ప‌లు అనుమానాలు తెర‌పైకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వివేకానందరెడ్డి త‌ల‌కు గాయాలు అవ‌డంతో ఆయ‌న పీఏ కృష్ణారెడ్డి పోలీసులు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే.. ఈ కేసు పై స్పందించిన క‌డ‌ప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పోస్టుమార్టం రిపోర్ట్ వ‌చ్చాక పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తు చేప‌డ‌తామ‌ని, దోషులు ఎంత‌టి వారైనా క‌ఠినంగా శిక్షిస్తామ‌ని తెలిపారు.

ఈ క్రింది వీడియో చూడండి 

ఇక తాజా మ్యాట‌ర్ ఏంటంటే.. వివేకానంద‌రెడ్డి మృతి పై ప‌లు అనుమానాలు ఉన్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌ధ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్పందించారు. ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం ప‌ట్ల దిగ్భాంతి వ్య‌క్తం చేసిన చంద్ర‌బాబు, పోలీసు ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చించారు. వివేకానంద‌రెడ్డి మృతి పై అత్యున్న‌త స్థాయిలో ద‌ర్యాప్తు చేయాల‌ని, వెంట‌నే ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని(సిట్) నియ‌మించాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు. ఈ క్ర‌మంలో నిందితులు ఏ స్థాయి వారైనా అరెస్ట్ చేసి క‌ఠినంగా శిక్షించాల‌ని చంద్ర‌బాబు కోరారు. ఈ క్ర‌మంలో ఈ కేసు ద‌ర్యాప్తు కోసం అడిష‌న‌ల్ ఎస్పీ ల‌క్ష్మీనారాయ‌ణ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. మ‌రి సిట్ ద‌ర్యాప్తులో ఎలాంటి విష‌యాలు బ‌య‌ట ప‌డ‌తాయో చూడాలి. మ‌రో ప‌క్క వైసీపీ నేత‌లు మాత్రం సిట్ పై నమ్మ‌కం లేదు సీబీఐ విచార‌ణ జ‌ర‌పాలి అని డిమాండ్ చేస్తున్నారు, నిన్న‌టి వ‌ర‌కూ జ‌మ్మ‌ల‌మ‌డుగు ప్ర‌చారంలో ఉన్న వైయ‌స్ వివేకా కేవ‌లం ఆరుగంట‌ల వ్య‌వ‌దిలో చ‌నిపోయారు అని దీని వెనుక ఏదైనా రాజ‌కీయ కుట్ర ఉందా అనే కోణంలో కొత్త అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు పార్టీ నాయ‌కులు.