జగన్ బర్త్ డే సందర్భంగా గిఫ్ట్ ఇచ్చిన చంద్రబాబు.. ఏంటో తెలిస్తే షాక్..

418

డిసెంబర్ 21.. వైఎస్ జగన్ పుట్టిన రోజు. తమ అధినేత పుట్టిన రోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల నుంచి జగన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశవిదేశాల్లోని జగన్ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న జగన్..

Image result for JAGAN AND CHANDRA BABU

శ్రీకాకుళం జిల్లాలో అభిమానుల సమక్షంలో కేక్ చేశారు. సోషల్ మీడియాలో జగన్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. అలాగే రాజకీయ నాయకుల నుంచి కూడా విషెస్ వస్తున్నాయి. ఇప్పటికే తెరాస పార్టీ నేతలు కవిత కేటీఆర్ తమ ట్విట్టర్ ద్వారా విషెస్ తెలియజేశారు. వైసీపీ అధినేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపమని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘జగన్ అన్న.. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే’ అంటూ కవిత ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్‌కు జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. ‘థ్యాంక్యూ ఫర్ యువర్ వార్మ్ విషెస్ కవితమ్మ’ అంటూ జగన్ రీట్వీట్ చేశారు.

ఇది ఇలా ఉంటె వైఎస్ జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘వైఎస్ జగన్‌గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఆయన.. నిండు ఆరోగ్యం, ఆనందాలతో హాయిగా ఉండాలి’అని ఆకాంక్షించారు. ఏపీలో రాజకీయంగా జగన్ కు చంద్రబాబుకే పోటీ. అయితే ఈరోజు పుట్టినరోజు కాబట్టి మిత్రుడా శత్రువా అని కూడా చూడకుండా చంద్రబాబు విషెస్ చెయ్యడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే కవితకు రిప్లై ఇచ్చిన జగన్ చంద్రబాబుకు ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు. దీని మీద కూడా చర్చ నడుస్తుంది. నమస్కారానికి ప్రతి నమస్కారం చెప్పడం సంస్కారం. ఆ సంస్కారం జగన్ కు లేదని కొందరు టీడీపీ నాయకులూ అంటున్నారు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. జగన్ కు చంద్రబాబు విషెస్ చెప్పడం గురించి దానికి జగన్ రిప్లై ఇవ్వకపోవడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.