ప్రణయ్ హత్యపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్

414

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని అల్లుడిని అతి కిరాతకంగా చంపించిన మిర్యాలగూడ ఘటన గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటుంది.తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుందని అల్లుడంటే ఇష్టం లేని మారుతీరావు కిరాయి గుండా చేత చంపించాడు.నిన్న ప్రణయ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.మారుతీరావు ను అరెస్ట్ చేశారు.చంపినా వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.అయితే ఈ ఘటన మీద పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు.ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించాడు.మరి ఆయన ఏమన్నాడో చూద్దామా.

Image result for pranay and amrutha

మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ అసెంబ్లీ నడుస్తుంది. దీనిపై స్పందించిన ఆయన సోమవారం అసెంబ్లీలో మాట్లాడాడు.మిర్యాలగూడలో జరిగిన దారుణాన్ని మనమందరం ఖండించాలి.ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం.కులం అనేది రూపుమాసిపోవాలి.అలా జరగాలంటే కులాలకతీతంగా పెళ్లిళ్లు జరిపించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందన్నారు. అహంభావంతో చంపించే పరిస్థితికి దిగజారడం బాధాకరమన్నారు.పెళ్లికానుక తేవడంలో ముఖ్య ఉద్దేశం కులాంతర వివాహాలను ప్రొత్సహించడమేనని ఆయన అన్నారు. పెళ్లికానుక విషయంలో కులాంతర వివాహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామన్నారు.కులాంతర వివాహాలు జరిగితేనే భవిష్యత్ తరం కులం అనేది లేకుండా ఉంటుందని ఆయన అన్నాడు.

Image result for chandra babu

మిర్యాలగూడలో ఇద్దరు కులాంతర వివాహం చేసుకుంటే తక్కువ కులం అనే ఉద్దేశంతో యువతి తండ్రే చంపించాడంటే సమాజంలో ఎంత మూఢనమ్మకం, అహంకారం ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు.ఇద్దరు మెజర్స్ అయినప్పుడు పెళ్లి చేసుకోవచ్చు.వారిద్దరికీ ఇష్టం ఉంటె చాలు ఇక ఎవరి ఇష్టం అవసరం లేదని మన రాజ్యాంగం ఇదే మనకు చెబుతుందని అన్నారు.అబ్బాయి మంచివాడు అయినప్పుడు, అమ్మాయి నచ్చినప్పుడు, పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటామని భావించినప్పుడు తల్లిదండ్రులు వాళ్లను ఆశీర్వదించాలని చంద్రబాబు అన్నారు. ఒకవేళ ఇష్టం లేకపోతే వాళ్లని వదిలేయాలన్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అంతేకాని దారుణంగా చంపించడంవల్ల అతను సాధించిందేమీ లేదని చంద్రబాబు పేర్కొన్నారు.ప్రతి ఒక్కరు కులం అనే దానిని రూపుమాపడానికి చూడాలి.కులం లేదని అందరు అనుకుంటే ఇలాంటి ఘటనలు జరగవు అని చంద్రబాబు అన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని మనం కోరుకుందామని చంద్రబాబు అన్నాడు.మరీ ఈ విషయం గురించి మీరేమంటారు.మిర్యాలగూడ పరువు హత్య గురించి దాని వెనుక ఉన్న కులం అనే విషయం గురించి అలాగే చంద్రబాబు నాయుడు ఈ ఘటన గురించి మాట్లాడుతూ అన్న మాటల గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.