చంద్ర‌బాబు సినిమా 80 శాతం కంప్లీట్

434

దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం ఏమైనా ఉంది అంటే? అన్ని సినిమా ఇండ‌స్ట్రీల్లో చ‌ర్చించుకునేది బ‌యోపిక్స్.. ఇప్పుడు ఈ బ‌యోపిక్స్ గురించి చ‌ర్చించుకుంటే సినిమా రాజ‌కీయ నాయ‌కుల బ‌యోపిక్స్ రానున్నాయి.. తెర‌పై క‌నిపించ‌నున్నాయి. ఇప్ప‌టికే యాత్ర‌తో వైయ‌స్సార్ , అలాగే ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎన్టీఆర్ పేరుతో రానుంది. ఇక క‌రుణానిధి, జ‌య‌ల‌లిత ఇలా ప్ర‌ముఖుల బ‌యోపిక్స్ రానున్నాయి.

Image result for chandra babu

అంద‌రూ ఇష్ట‌ప‌డేవి కూడా ఇలాంటి చిత్రాలే, అందుకే దర్శ‌కులు కూడా ఇలాంటి సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.ఇక అసలు విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బయోపిక్ కూడా తెరకెక్కుతోంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కూడా పూర్తయ్యింది.

Image result for chandra babu

ఇక చంద్రబాబు పాత్రలో వినోద్ నువ్వుల నటిస్తుండగా ఎన్టీఆర్ గా భాస్కర్ కనిపించనున్నారు…పేద కుటుంబంలో జన్మించిన చంద్రబాబు నాయుడు విద్యార్థి నేత నుంచి రాజకీయ నేతగా ఎలా మారారు… ఎమ్మెల్యేగా అలాగే ముఖ్యమంత్రిగా ఏ విధంగా గెలిచారు అనే విషయాల గురించి సినిమాలో క్లుప్తంగా చూపించ‌నున్నారు. ఈ సినిమాని జె రాజేంద్ర నిర్మిస్తున్నారు.. ఇక ద‌ర్శ‌కుడిగా వెంక‌ట‌ర‌మ‌ణ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చంద్ర‌బాబు పాల‌న ఇప్ప‌టికీ ఎవ‌రూ మ‌ర్చిపోలేరు.. ఉమ్మ‌డి ఆంద్ర‌ప్ర‌దేశ్ లో ఆయ‌న పాల‌న‌కు ఎంతో మంది ప్ర‌జాభిమానులు ,ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈ సినిమా మ‌రో రెండు నెల‌ల్లో విడుద‌ల కానుంది అని తెలుస్తోంది.