చంద్ర‌బాబు ఏ1 వైసీపీ ఘాటు – హాట్ కామెంట్స్

273

జ‌గన్ పై జ‌రిగిన కోడిక‌త్తి దాడిలో తెలుగుదేశం అధినేత పై వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. దీనికి కార‌ణం సీఎం చంద్రబాబు అని జ‌గ‌న్ పై క‌త్తిదాడి జ‌రిగిన త‌ర్వాత సీఎం న‌వ్వుతూ మాట్లాడారు అని విమ‌ర్శ‌లు చేశారు… సీఎం చంద్రబాబు, రాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే మా పార్టీ అధినేతపై కత్తితో దాడి జరిగింది అని విమ‌ర్శ‌లు చేశారు వైసీపీ నాయ‌కులు… ఇక శ్రీనివాస్ కు ప్రాణ‌హ‌ని ఉంది అని అన్నాడు, అత‌నికి ఇంకా భూమిపై నూక‌లు ఉన్నాయి లేక‌పోతే మ‌రో దారుణం జ‌రిగేది అని అంటున్నారు పార్టీ నేత‌లు.

Image result for roja mla and bhosthasatyanarayana
బొత్స స‌త్య‌నారాయ‌ణ విశాఖలో మాట్లాడుతూ, కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల మైత్రిని చూస్తుంటే 420, 840లు పొత్తు పెట్టుకున్నట్టుగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిపరుడంటూ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఏడాది కిందట చార్జిషీట్‌ విడుదల చేసింది. మ‌రి ఇప్పుడ అదే పార్టీ తెలుగుదేశం పార్టీతో క‌లిసింది వీరిద్ద‌రి మ‌ధ్య సీక్రెట్ ఏమిటో ప్ర‌జ‌ల‌కు తెలియాలి అని ఆయ‌న విమ‌ర్శించారు ప్రజల నుంచి సంతకాలు కూడా సేకరించింది. అలాంటి పార్టీతో తెలుగుదేశం పొత్తుపెట్టుకోవడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ‘దేశంలోని వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయని, మోదీ నుంచి దేశాన్ని రక్షించేందుకే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్నామని చంద్రబాబు ప్రకటించుకోవడం హాస్యాస్పందంగా ఉంది అని వైసీపీ విమ‌ర్శించింది.