జ‌గ‌న్- ప‌వ‌న్ విష‌యంలో బాబు స‌రికొత్త నిర్ణ‌యం

414

తెలుగుదేశం పార్టీ బీజేపీని టార్గెట్ చేయాలి అని భావిస్తోంది… ఇటు ప‌వ‌న్ – జ‌గ‌న్ కు మ‌ధ్య జ‌రుగుతున్న వివాదంలో త‌ల‌దూర్చ‌ద్దు అని తెలియ‌చేశారు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎవరూ కూడా ఈ నిర్ణ‌యంలో త‌ల‌దూర్చ‌కూడదు అని అన్నారు…ఇక ప‌వ‌న్ జ‌గ‌న్ విష‌యంలో తల‌దూర్చి పార్టీ ప్ర‌తిష్ట‌కు దెబ్బ తీసుకురావ‌ద్ద‌ని చంద్ర‌బాబు తెలియ‌చేశారు.. ఇక ప‌వ‌న్ చేసిన కామెంట్ కు జ‌గ‌న్ కౌంట‌ర్ ఇస్తే ఇటు జ‌గ‌న్ కౌంట‌ర్ కు ప‌వ‌న్ కౌంట‌ర్ ఇచ్చారు…. ఈ వివాదంలో మ‌ధ్య‌లో క‌లుగ చేసుకుని పార్టీ ప్ర‌తిష్ట‌కు దిగ‌జార‌వ‌ద్ద‌ని అంటున్నారు.

Image result for jagan

మొత్తానికి తెలుగుదేశం పార్టీ నిర్ణ‌యాలు చూస్తుంటే ఈ ఇద్ద‌రు నేత‌ల విష‌యంలో మ‌నం వెళ్ల‌డం ఎందుకు అని భావించిన‌ట్లు తెలుస్తోంది.. మ‌రీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత ఇప్పుడు ప్ర‌త్యేక హూదా పై మాత్ర‌మే ఫోక‌స్ పెట్టాలని వారు ఇరువురు చేసుకున్న కామెంట్ల గురించి ఇప్పుడు చ‌ర్చ‌ల్లో త‌ల‌దూర్చ‌కూడ‌దు అని అన్నారు.

Related image

మొత్తానికి టీడీపీ వేసే స్టెప్ ఇప్పుడు పార్టీకి మ‌రింత ప్ల‌స్ అయింది. అది వాళ్లిద్దరూ తేల్చుకోవాల్సిన విషయమని. తాజాగా జ‌రిగిన టీడీపీ సినియ‌ర్ల మీటింగులో ఆయ‌న తెలియ‌చేశారు… విలేక‌రులు అడిగినా ఆ విష‌యాన్ని అవాయిడ్ చేయాల‌ని ఆయ‌న తెలియ‌చేశారు…ఈ అంశంపై విలేకరుల సమావేశం నిర్వహించాలనుకొన్న విజయవాడ నగర ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఈ సమాచారం అందడంతో దానిని రద్దు చేసుకొన్నారు.. సచివాలయంలోని కొందరు మంత్రులు మాత్రం తమ వద్దకు వచ్చిన మీడియా ప్రతినిధుల వద్ద దీనిపై కొంత మేర స్పందించారు. జగన్‌ వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని వారన్నారు. దీంతో సీఎం ఈ నిర్ణ‌యం తీసుకున్నారు అని తెలుస్తోంది..