కోడెల మృతి వెనుక చంద్రబాబు బయటపెట్టిన షాకింగ్ నిజాలు

125

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మ‌హ‌త్య రాజ‌కీయ రంగు పులుముకుంది, ప్ర‌భుత్వం పై తెలుగుదేశం విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది, వైసీపీ పెట్టిన కేసుల వ‌ల్ల ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు అని ఆరోపిస్తోంది.. కోడెల ఆత్మ‌హ‌త్య‌కు ప్రభుత్వ వేధింపులే కారణమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఉన్మాదిలా వ్యవహరిస్తోందని… కోడెల మృతిపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కోడెలలాంటి వ్యక్తికి ఇలాంటి ముగింపు రావడం బాధాకరమన్నారు. కేసులు, వేధింపులతో కోడెల కుటుంబాన్ని చెల్లాచెదురుచేశారని.. కోడెల తప్పు చేసి చనిపోలేదు, వేధింపులకు గురై చనిపోయారని చంద్రబాబు ఆరోప‌ణ చేశారు… దేశ చరిత్రలో ఓ సీనియర్‌ నేత ఆత్మహత్య చేసుకోవడం ఇదే తొలిసారి అని చెప్పుకొచ్చారాయ‌న‌… రూ.43వేల కోట్లు దోచుకుని, 11 చార్జిషీట్లలో ముద్దాయిగా ఉన్న జ‌గ‌న్, కేవ‌లం లక్ష రూపాయాల ఫర్నీచర్ కోసం కోడెల మీద కేసు పెట్టారు అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి పోలీసులు.. ఆలిండియా సర్వీస్‌ ఉద్యోగులు సరెండర్‌ అయ్యారని చంద్రబాబు ఆరోపించారు.

Image result for chandra babu

కోడెలను వైసీపీ ప్రభుత్వం శారీరకంగా..మానసికంగా.. ఆర్థికంగా వేధించి చంపిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కోడెల లాంటి వ్యక్తే అవమానాలను భరించలేకపోయారని ఇక సామాన్యుల ప‌రిస్దితి ఏమిటి అని నిల‌దీశారాయ‌న‌. కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు కోడెలను వేధించారని చంద్రబాబు మండిపడ్డారు. దేశ చరిత్రలో ఓ సీనియర్‌ నేత ఆత్మహత్య చేసుకోవడం ఇదే తొలిసారి అని దీనిని వ‌దిలేది లేద‌ని తెలియ‌చేశారు. కోడెలది ప్రభుత్వం చేసిన హత్య అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. కోడెల మృతిపై ప్రతి ఇంట్లో, మేధావుల్లో చర్చ జరగాలన్నారు. మరే వ్యక్తికీ కోడెలలాంటి పరిస్థితి రాకూడదన్నారు. ఆరోపించారు. తప్పుచేసిన వాడికి శిక్ష వేస్తే నేనూ అభినందించేవాడినన్నారు. కుమారుడు, కూతురు వేధింపుల వల్లే… కోడెల ఆత్మహత్య చేసుకున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు వాపోయారు. శివరాం విదేశాల్లో కాకుండా ఇక్కడే ఉండుంటే… కోడెలను ఆయనే చంపాడని కేసులు పెట్టేవారని చంద్రబాబు విమ‌ర్శించారు. వైసీపీది టెర్రరిస్టు ప్రభుత్వమే కాదని… అంతకంటే ఎక్కువ అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.

Image result for kodela siva prasad

కోడెల బలవన్మరణంతో నిన్నటి నుండి తన మనసు మనసులో లేదని.. 40 ఏళ్ల అనుభవం ఉన్న తాను పార్టీలో సహచర నేత బలవన్మరణం చేసుకుంటే ఏమీ చేయలేమా అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. కోడెల..ఆయన కుటుంబ మీద నమోదైన కేసులు ప్రభుత్వ కక్ష్య సాధింపులో భాగమేనని వివరించారు. తనకు నిద్ర కూడా పట్టటం లేదంటూ కోడెల తన వద్ద వాపోయిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసారు.కోడెలకు వ్యతిరేకంగా కేసులు వేయాలని… ట్విట్టర్‌లో, పేపర్‌లో విజయసాయిరెడ్డి ప్రకటనలు చేశారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. సాక్షి పేపర్‌లో పదేపదే కోడెలను విమర్శిస్తూ కథనాలను రాయించారన్నారు. అనేక చీటింగ్‌ కేసుల్లో నిందితుడైన రంజీ క్రికెటర్‌ నాగరాజుతో… ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు వేయించారన్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

డీజీపీని సంప్రదించినా తన వల్ల కాదని తిప్పి పంపారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కోడెలపై 19 కేసులు పెట్టారని, పాత కేసులు తిరగదోడారన్నారు.కోడెల తప్పు చేసి చనిపోలేదు, వేధింపులకు గురై చనిపోయారని చంద్రబాబు పేర్కొన్నారు. తన ఇంట్లోని ఫర్నిచర్‌ తీసుకెళ్లాలని…అసెంబ్లీ కార్యదర్శికి కోడెల నాలుగు లేఖలు రాశారన్నారు.కానీ అసెంబ్లీ కార్యదర్శి కనీసం స్పందించలేదన్నారు. . రాష్ట్రమంతా భయభ్రాంతులకు గురిచేయడానికే… ప్రజావేదికను కూల్చేశారని, తన ఇంటిని ముంచేందుకు యత్నించారని పేర్కొన్నారు. ఏ తప్పు చేయని నన్నపనేని, అచ్చెన్నాయుడుపై కేసులు పెట్టించారన్నారు. కుటుంబరావుపై తప్పుడు కేసులు బనాయించారని చంద్రబాబు విమ‌ర్శించారు.