హరికృష్ణ పాడెమోసిన చంద్రబాబు జనం ఏం చేశారో చూస్తే షాక్!

476

దివంగత నేత హరికృష్ణ అంతిమయాత్ర మొదలైంది. హరికృష్ణ అంతిమయాత్రకు రెండు ప్రత్యేక వాహనాలను సిద్ధం చేశారు. తమ అభిమాన నటుడు, నాయకుడిని కడసారి చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు హరికృష్ణ నివాసానికి తరలివచ్చారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుంచి వేలాదిమంది అభిమానులు హైదరాబాద్ చేరుకున్నారు. కాగా… అంతిమయాత్రలో తొక్కిసలాట జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. వందలాది మంది పోలీసులతో ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు చేస్తోంది

మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతలో స్వగృహం నుంచి హరికృష్ణ పార్థివ దేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తన బావమరిది హరికృష్ణ పాడె పట్టుకున్నారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ పాడె పట్టుకున్నారు. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌, కుటుంబ సభ్యులు అశ్రునయనాలతో ముందు నడిచారు. ‘హరికృష్ణ అమర్ రహే’ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. హరికృష్ణ భౌతికకాయాన్ని అక్కడి నుంచి వైకుంఠ రథం (ప్రచార రథం) ఎక్కించారు. దాదాపు పది కిలోమీటర్ల మేర అంతిమయాత్ర సాగి మహాప్రస్థానం చేరుకోగానే ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.

Image result for hari krishna nandamuri pada

సీఎం చంద్ర‌బాబు నిన్న‌టి నుంచి అక్క‌డే ఉండి ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు.. ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబం వెంటే మ‌హాప్ర‌స్ధానానికి త‌ర‌ళి వెళ్లారు ఆయ‌న కుటుంబ స‌భ్యులు సీఎం చంద్ర‌బాబు .. ఆయ‌న వెంటే నంద‌మూరి అభిమానులు ఆయ‌న కుటుంబ స‌భ్యులు క‌దిలి వెళుతున్నారు. హ‌రికృష్ణ మ‌ర‌ణంతో ఇటు నంద‌మూరి కుటుంబం నిన్న‌టి నుంచి శోక‌సంద్రంలో ఉంది. అంతిమ సంస్కారాలు చేసేందుకు క‌ల్యాణ్ రామ్ ఎన్టీఆర్ వెన్నంటి వెళుతున్నారు.. ఇప్ప‌టికే ఇటు ప్ర‌భుత్వం అధికారిక లాంఛ‌నాల‌తో అంతిమ‌సంస్కార ఏర్పాట్ల‌ను చేసింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఎన్ని రాజ‌కీయ విభేదాలు ఉన్నా పార్టీలో ఎన్ని గొడ‌వ‌లు ఉన్నా చంద్ర‌బాబు ఇలా హ‌రికృష్ణ పాడెమోయ‌డం, ఆయన కుటుంబానికి అండ‌గా ఉండ‌టంతో ఇటు ప్ర‌జ‌లు కూడా షాక్ అయ్యారు….ఆయ‌న‌కు హృద‌య‌పూర్వ‌కంగా పూలు జ‌ల్లుతూ నంద‌మూరి కుటుంబంలో ఆయ‌న పేరును స్మరించుకుంటున్నారు. చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.