కేరళ వరద బాధితులకు దుబాయ్ రాజులు ఇచ్చిన 700 కోట్లను…వెనక్కి ఇచ్చేసిన మోడీ

537

వ‌ర‌ద‌ల్లో 15 రోజులుగా చిన్నాబిన్నం అయిన కేర‌ళ, ఇప్పుడు ఉగ్ర‌రూప‌కోర‌ల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తోంది. 15 రోజులుగా స‌రైన నీరు తిండి లేక అవ‌స్తలు ప‌డ్డారు ప్ర‌జ‌లు. వేలాదిగా సైన్యం కేర‌ళ‌ను ఆదుకోవ‌డానికి వ‌చ్చారు. అయితే ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం అయినా ఇలాంటి ప్ర‌కృతి విప‌త్తులు ఎదుర్కొంటే దీనిని జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించి, కేంద్రం అన్నీంటా చ‌ర్య‌లు తీసుకుని మ‌ర‌లా ఇక్క‌డ అభివృద్ది జ‌రిగేలా చూస్తుంది. ఇక్క‌డ కూలిపోయిన, నేల‌మ‌ట్ట‌మైన వాటికి న‌ష్ట‌ప‌రిహారంచెల్లించి ఆదుకుంటుంది. ఇక ఆ దేశ ఆర్దిక ప్ర‌ణాళిక బ‌ట్టీ జాతీయవిప‌త్తుకు నిధులు కేటాయిస్తారు. కేర‌ళ‌లో వ‌చ్చిన విప‌త్తుకు, యూఏఈ అలాగే మిగిలిన దేశాలు ప్ర‌క‌టించిన సాయాన్ని, కేంద్ర ప్రభుత్వం తిరస్కరించనున్నట్టు
తెలుస్తోంది.Image result for kerala floodరాష్ట్ర పునర్నిర్మాణం, బాధితులకు పునరావాసం కోసం భారత్‌కు తోడ్పడేందుకు సిద్ధమని యూఏఈ, ఖతార్, మాల్దీవులు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. విదేశాలు ప్రకటించిన సాయం పట్ల పూర్తి కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నప్పటికీ, తన సొంత నిధులతోనే కేరళను పునర్నిర్మించాలని భారత్ భావిస్తున్నట్టు, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రపంచం నలుమూలల నుంచి వ్యక్తిగతంగా పంపిస్తున్న విరాళాలకు, విదేశాల్లో స్థిరపడిన కేరళ వాసులకు ప్రభుత్వం ఎలాంటి అడ్డూ చెప్పడంలేదు. కేవ‌లం విదేశాల ప్ర‌భుత్వాల నుంచి వ‌చ్చే విరాళాల‌కు కేంద్రం నో చెబుతోంది..

Image result for modi

యూఏఈ ప్రధానమంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ కేరళకు రూ. 700 కోట్ల భారీ సాయాన్ని ప్రకటించారు. దుబాయ్, కేరళ మధ్య అనుబంధానికి, భారత్-యూఏఈ మధ్య సన్నిహిత సంబంధాలకు ప్రతీకగా అందరూ దీన్ని భావించారు. వెంట‌నే ప్రధాని మోదీ యూఏఈ అధినేతకు ట్విటర్లో కృతజ్ఞతలు చెప్పారు. కేరళ సీఎం పినరయి విజయన్ కూడా యూఏఈకి కృతజ్ఞతలు చెప్పారు. ఖతార్ దాదాపు రూ.35 కోట్లు ఆఫర్ చేయగా.. ఇటీవల భారత్‌తో స్నేహం కలుపుకున్న మాల్దీవులు కూడా 50 వేల డాలర్లు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. కాగా ఐక్య రాజ్య సమితి సాయం అర్ధించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ నేత శశిథరూర్ సైతం జెనీవా వెళ్లారు. అయితే ఇవన్నీ ఆచరణ సాధ్యం అయ్యేట్టు కనిపించడం లేదు. ఇంకా భారత్ నుంచి ఎలాంటి అభ్యర్థన రాకపోవడమే దీనికి కారణం.

Image result for dubai kingsవిదేశాల నుంచి సాయం తీసుకోరాదన్న భారత విధానం కొత్తేం కాదు. 2013 ఉత్తరాఖండ్ వరదల సమయంలోనూ అప్పటి యూపీఏ ప్రభుత్వం విదేశాల సాయాన్ని సున్నితంగా తిరస్కరించింది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు విదేశాల సాయం తీసుకోరాదని 2004 సునామీ సమయంలో భారత్ దీర్ఘకాలిక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఎలాంటి విపత్తులనైనా తట్టుకుని నిలబడగల సామర్థ్యం మన దేశానికి ఉన్నదనే విషయాన్ని స్పష్టం చేయడమే దీని లక్ష్యం.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్నందునే తాజాగా విదేశాలు ప్రకటించిన సాయాన్ని కేంద్రం తిరస్కరించనున్నట్టు తెలుస్తోంది. ఇక విదేశీ వ్య‌వ‌హారాల నుంచి ఈ మొత్తం పై ఆయా దేశాలు ఇచ్చే న‌గ‌దును, తిర‌స్క‌రిస్తున్నారు అని తెలుస్తోంది.. ఇకవిదేశాల కంటే మ‌న దేశ ఆర్ధిక వ్య‌వ‌స్ద చాలా మెరుగ్గా ఉంటుంది. అందుకే ఆయాదేశాల సాయం తీసుకోవ‌డం కంటే మ‌న‌మే నిర్మించుకోవాలి అని కేంద్రం భావిస్తోంది. దీనిపై మోడీ కూడా ఆయాదేశాల అధినేత‌ల‌కు ఈ విష‌యం తెలియ‌చేనున్నార‌ని అంటున్నాయి ప్ర‌భుత్వ. మొత్తానికి కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంపై చాలా వ‌ర‌కూ ప్ర‌జ‌ల నుంచి హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది.