ఆర్టికల్ 370 రద్దు కాలేదు షాకింగ్ నిజాలు బయటపెట్టిన అమిత్ షా

244

స్వతంత్ర భారత దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. జమ్మూ కశ్మీర్‌‌.. దేశంలో సంపూర్ణంగా విలీనమైంది. దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు -2019’కు పార్లమెంట్ ఉభయసభలు ఆమోదముద్ర వేశాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదంతో వెంటనే ఇది చట్టం రూపంలో అమల్లోకి వచ్చింది
దశాబ్దాలుగా కశ్మీర్ విషయంలో కొరకరాని కొయ్యలా మారిన ఆర్టికల్ 370కి లోక్‌సభ ముగింపు పలికింది. ఆర్టికల్ 370 రద్దుకు అనుకూలంగా 351 మంది సభ్యులు ఓటు వేయగా.. 72 మంది వ్యతిరేకించారు. ఒక సభ్యుడు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు ఉభయ సభల ఆమోదం లభించడంతో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణానికి ముగింపు పలికినట్లైంది.

ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం, అధికారాలు రద్దయ్యాయి. ఇకపై భారత రాజ్యాంగంలోని నిబంధనలన్నీ జమ్మూ కశ్మీర్‌కు సంపూర్ణంగా వర్తించేందుకు వీలు కలిగింది. జమ్మూ కశ్మీర్‌లో స్థానికతను నిర్వచించడానికి, వారికి ప్రత్యేక హక్కులు కల్పించడానికి ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఇచ్చిన ఆర్టికల్ 35ఎ కూడా ఈ చర్యతో అటకెక్కింది. జమ్మూ కాశ్మీర్‌లో కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ.. దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్‌ అంశంపై మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండుగా విభజించింది. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలకు కేవలం 36 గంటల్లో ముగింపు పలికింది. పునర్‌వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంతో.. జమ్మూ కశ్మీర్‌ ప్రాంతం రెండు ప్రాంతాలుగా విడిపోయింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లఢక్ శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడ్డాయి. బిల్లు ఆమోదం పొందిన వెంటనే లోక్‌సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు. అయితే ఆర్టికల్ 370 పై మాత్రం ఇంకా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి, ఈ సమయంలో తాజాగా కీలక అధికారి నుంచి ఓ స్పష్టమైన సమాధానం వచ్చింది.

Image result for amit shah

ఆర్టికల్‌ 370ను కేంద్రం రద్దు చేయలేదని, అందులోని 35ఏ వంటి నిబంధనలను మాత్రమే రద్దు చేసిందని మాజీ సొలిసిటర్‌ జనరల్‌ హరీశ్‌ సాల్వే తెలిపారు. ఆయన సుప్రీంకోర్టులో విలేకరులతో మాట్లాడుతూ ఆర్టికల్‌ 370 సెక్షన్‌ 3 జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడమే కాదు, ఆ హోదాను ఏ సమయంలోనైనా ఒక ఉత్తర్వుతో రద్దుచేసే అధికారాన్ని రాష్ట్రపతికి ఇచ్చిందని తెలిపారు. ఈ నిబంధన ద్వారానే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నుంచి ఉత్తర్వును కేంద్రం తెచ్చుకోగలిగిందని వివరించారు. రాజ్యాంగంలోని నిబంధనలను కేంద్రం పూర్తిగా వినియోగించిందని చెప్పారు. జమ్మూ కశ్మీర్‌ విభజనకు 2, 3 అధికరణలను ఉపయోగించుకుందంటూ ఈ ప్రక్రియను ‘పెద్ద సర్జరీ’గా ఆయన అభివర్ణించారు.

Image result for amit shah

కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కలిగించే 370వ అధికరణాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ ఆర్టికల్‌లోని నిబంధనలనే వాడుకోవడం ఓ విశేషం. ‘మేం 370ని రద్దు చేయడం లేదు.. ఆర్టికల్‌ 370 అనేది అధికారాలనిచ్చే చట్టం. భారత రాజ్యాంగంలోని ఏ భాగాలు జమ్మూ కశ్మీర్‌కు వర్తిస్తాయో మాత్రమే అది చెబుతుంది. అదే అధికరణంలోని మూడో నిబంధన, ఆ రాష్ట్రంపై భారత రాజ్యాంగ పరిధిని మార్చే అధికారాన్ని రాష్ట్రపతికి కల్పిస్తోంది. ఆర్టికల్‌ 370 రద్దు అనేది రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే సాధ్యం. మేం రాజ్యాంగ సవరణ చేయడం లేదు.

Image result for amit shah

ఆర్టికల్‌ 370 లో పేర్కొన్న కొన్ని అంశాలను అమలు చేయకుండా నిలిపేసే లేదా అంశాలను సవరించే అధికారం అదే ఆర్టికల్‌లోని మూడో నిబంధన అంటే 370 (3) ప్రకారం రాష్ట్రపతికి ఉంది…. ఓ రాజ్యాంగ ఉత్తర్వు ద్వారా రాష్ట్రపతి దీన్ని చేయవచ్చు అని హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. ఆర్టికల్‌ 370 కింద గతంలో చేసిన అన్ని ఉత్తర్వులనూ తాజా ఉత్తర్వు రద్దు చేస్తుందని ఆయన వివరించారు. నిజానికి ఇది మేం మొదటిసారిగా చేస్తున్నది కాదు. 1952, 1962ల్లో కాంగ్రెస్‌ పార్టీ చేసినదే. కాంగ్రెస్‌ మార్గాన్నే మేమూ అనుసరించాం అని ఆయన కాంగ్రెస్ ను డైలమాలోకి నెట్టారు.అలాగే అమిత్ షా కూడా అక్కడ సాధారణ పరిస్ధితులు వచ్చిన తర్వాత యధావిధిగా ప్రక్రియ ఉంటుంది అని తెలియచేశారు.