హైదరాబాద్ దేశ రెండో రాజధాని కేంద్రం సంచలన నిర్ణయం

22

ఆ మధ్య హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారనే ఊహాగానాలు కొంతకాలం పాటు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి ప్రతిపాదనేది కేంద్రం దగ్గర లేదని కేంద్రమంత్రులు వివరణ ఇవ్వడంతో ఈ పుకార్లకు తెరపడింది. అయితే తాజాగా హైదరాబాద్‌ దేశానికే రెండో రాజధాని కావొచ్చని బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిపోవడంతో, భారతరత్న, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్నట్టుగా హైదరాబాద్ నగరం రెండో రాజధాని అయ్యే అవకాశాలను తోసిపుచ్చలేమని ఆయన అన్నారు.

Image result for modi and amit shah

దేశ రెండో రాజధాని అనే అంశంపై మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ అంతా చర్చకు దారితీశాయి. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయాలన్న చర్చ పార్లమెంట్ ఎన్నికల సమయంలో వచ్చిందని ఆయన తెలిపారు. కానీ ఇప్పటి వరకు దీనిపై కేంద్రంలో కానీ, పార్టీలో కానీ చర్చ జరగలేదన్నారు. హైదరాబాదే కాదని, తెలంగాణను నేషనల్ టెరిటోరియల్ ప్రాంతంగా కవి జైరాజ్ అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పే సందర్భంగా మాత్రేమే రెండో రాజధాని ప్రస్తావన తీసుకొచ్చానని విద్యాసాగర్ రావు చెప్పారు.

ఈ క్రింద వీడియో చూడండి

హైదరాబాద్ మాత్రమే కాదని, తెలంగాణతోపాటు ఢిల్లీ మొత్తాన్ని నేషనల్ టెరిటోరియల్ చేయాలని ఈ మధ్య నివేదికలు వచ్చినట్లు విద్యాసాగర్‌రావు చెప్పారు. రెండో రాజధానిపై పార్టీలో చర్చిస్తామని ఎన్నికల సమయంలో లక్ష్మణ్ చెప్పినట్లు విద్యాసాగరరావు తెలిపారు. ఢిల్లీలో కాలుష్యం ఎక్కువైపోయిందని, హైదరాబాద్ రెండో రాజధానిగా సూటబుల్ అవుతుందన్నారు. గ్లోబల్ వార్మింగ్ వచ్చాక కాలుష్యం అంతటా ఉందని వ్యాఖ్యానించారు. రెండో రాజధాని అంశం బీజేపీకి సంబంధించినది మాత్రమే కాదన్నారు. రెండో రాజధాని కోసం అన్ని రాజకీయ పార్టీలు కలసి కేంద్రం దగ్గరకు వెళ్ళాలని విద్యాసాగర్‌రావు చెప్పారు. రెండో రాజధాని కోసం అన్ని పార్టీలను లీడ్ చేసే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఈ డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే.. ఈసారి ఏకంగా బీజేపీ సీనియర్‌ నేత, మాజీ గవర్నర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పని చేసిన విద్యాసాగర్ రావు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Image result for hyderabad

ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గాలి కాలుష్యం 400 పీపీఎంకు పైగా చేరుకోవడంతో అక్కడి ప్రజలు ఊపిరి తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుబయటకు రావాలంటే వణికి పోతున్నారు. అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. కాలుష్య తీవ్రవ దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. మరి కేంద్రం హైదరాబాద్ ని రెండో రాజధానిగా చేస్తే ఎలా ఉంటుంది మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

ఈ క్రింద వీడియో చూడండి