దేశంలో అన్ని రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించిన కేంద్రం బయటకు వెళితే అంతే

162

జమ్మూ కశ్మీరుపై పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. హిమాలయ పర్వత సానువుల్లోని కీలక రాష్ట్రాన్ని మూడు భాగాలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. జమ్మూ, కశ్మీర్‌, లద్ధాఖ్‌‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించింది. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ,కశ్మీర్ ఏర్పడనున్నాయి. చట్టసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్ధాఖ్‌‌ ఏర్పడనుంది. జమ్మూ కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370, 35ఏ కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కేంద్రం తాజా నిర్ణయంతో.. టిబెట్‌, చైనా, గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ సరిహద్దులుగా కలిగిన లద్ధాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతమైంది.

Image result for kashmir

కశ్మీర్‌పై కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. మత ఘర్షణలకు తలెత్తే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్రాలను అప్రమత్తం చేయడం విశేషం. కేంద్ర హోం మంత్రి అధ్యర్యంలోని సీసీఎస్ కమిటీ సమావేశం కొద్దిసేపటి కిందట భేటీ అయ్యారు. ఇక, మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. నిర్బంధంలోకి తీసుకున్న నేతలకు దేశంలో ప్రతి పౌరుడు అండగా ఉంటాడని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న క్రమంలో క్రియాశీలక రాజకీయ నేతలు ప్రజల మధ్య ఉండాల్సిన అవసరముందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ క్రింది వీడియో ని చూడండి

కశ్మీర్‌లో అనిశ్చిత, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, భారీగా భద్రతా బలగాల మోహరింపు, మాజీ సీఎంల గృహ నిర్బంధం తదితర పరిణామాల నేపథ్యంలో కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన కోరుతూ కాంగ్రెస్ రాజ్యసభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో ఉదయం 11 గంటలకు కీలక ప్రకటన చేశారు. తర్వాత లోక్‌సభలో 12 గంటలకు ప్రకటన చేశారు. క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన నేరుగా పార్లమెంటుకు చేరుకున్నారు. మరోవైపు, కశ్మీర్‌లోని ఉగ్రవాదుల్లో 80 శాతం మంది గతంలో రాళ్లు రువ్వేవారిగా పనిచేసినట్టు భద్రతాధికారులు పేర్కొన్నారు. రాళ్లు రువ్వే ఘటనలే ఉగ్రవాదులకు రిక్రూట్‌మెంట్ల్‌గా మారుతున్నాయని, వారిని గుర్తించే ఉగ్రబృందాలు వారికి నెమ్మదిగా భావజాలాన్ని జొప్పించి ఉగ్రశిక్షణకు పంపిస్తున్నాయి. ఇక వీరి భరతం పట్టనున్నారు, అయితే ఎన్నో ఏళ్లుగా కశ్మీరు ప్రజలు పోరాటం చేసి సాధించుకున్న ఈ ఆర్టికల్ 370 రద్దు చేయడం దారుణమైనదిగా కాంగ్రెస్ చెబుతోంది. కాని దేశంలో ఉగ్రవాద దాడులకు సాయం చేస్తున్న కొందరికి ఇది చెంపపెట్టు అంటున్నారు ఆర్మీ అధికారులు. ఉగ్రదాడులు జరుగుతుంటే కాంగ్రెస్ ఇలాంటి మాటలు మాట్లాడటం ఏమిటి అని, జవాన్ల ప్రాణాలు పోతుంటే కాంగ్రెస్ ఎందుకు ఇలాంటి రాజకీయాలు చేస్తోందని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మరి బీజేపీ తీసుకున్న నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.