టీడీపీ ఎమ్మెల్యేపై కేసు పెట్టండి -కోర్టు తీర్పు

346

వైసీపీ ఎమ్మెల్యే రోజా పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు అనే విమ‌ర్శ‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న పెన‌మ‌లూరు ఎమ్మెల్యే బోడె ప్ర‌సాద్ కు కోర్టు షాక్ ఇచ్చింది, టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా ఏపీ పోలీసులను మంగళవారం హైదరాబాద్‌ హైకోర్టు ఆదేశించింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బోడె ప్రసాద్‌పై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా,కేసు నమోదుచేయకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు..

Image result for bode prasad
ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌పై కేసు నమోదు చేయకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, అతనిపై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆమె ఆగస్టులో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక దీనిపై ఎటువంటి తీర్పు వ‌స్తుందా అని పార్టీ త‌ర‌పున నాయకుల కూడా ఎదురుచూశారు, చివ‌ర‌కు ఆమె పై చేయి సాధించారు.

Image result for bode prasad

దీంతో ఈరోజు విచార‌ణ ప్రారంభించిన కోర్టు ఆ పిటిష‌న్ పై అన్నింటిని చ‌ర్చించారు.. దీనిపై రోజా తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇక కేసు న‌మోదు చేయ‌కపోవ‌డానికి కార‌ణాలు తెలుసుకుని కోర్టు ప్ర‌శ్నించింది, ఎమ్మెల్యే బోడె ప్ర‌సాద్ పై కేసు న‌మోదు చేయాల‌ని ఏపీ పోలీసుల‌ను ఆదేశించింది కోర్టు.. రోజా వేసిన పిటిష‌న్లో హోం శాఖ ముఖ్య కార్యదర్శి, విజయవాడ పోలీస్‌ కమిషనర్, పెనమలూరు ఎస్‌హెచ్‌ఓలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.