కన్నాకి షాక్ ఇచ్చిన బుద్దా వెంక‌న్న‌

341

ఏపీలో తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్ర‌బాబుకు వారానికి ప‌లు ఐదు ప్ర‌శ్న‌లు అంటూ స‌రికొత్త ప్ర‌శ్నా కార్య‌క్ర‌మం ప్రారంభించారు… ఏపీ-బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా లక్ష్మీనారాయ‌ణ‌, ఇక తాజాగా ఆయ‌న ప్ర‌శ్న‌లు విష‌యం ప‌క్క‌న పెట్టి మేము అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాలి అని అంటున్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దావెంక‌న్న‌,ఆయన మీడియాతో మాట్లాడుతూ కన్నాకు తాము 10 ప్రశ్నలు వేస్తున్నామన్నారు. కన్నాకు మించిన భూబకాసురుడు ఎవరైనా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. ముగ్గురు సీఎంల దగ్గర పనిచేసి వందల ఎకరాల భూమిని కాజేయలేదా? అని బుద్ధా నిలదీశారు.

Image result for buddha venkanna

పదేళ్లలో జరిగిన ఐదు లక్షల ఎకరాల భూ కబ్జాలో కన్నా పాత్ర ఎంత? అని అడిగారు. ఇక ఆయ‌న గురించి గుంటూరు జిల్లా అంద‌రికి తెలుసు అని ఆయ‌న బాబు పై విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటే ఇక్క‌డ ఎవ‌రూ ఊరుకోరు అని ఆయన అన్నారు.సైకిల్ కూడా లేని క‌న్నా ఎలా ఇంత వంద‌ల కోట్ల ఆస్తిసంపాదించారు ఆయ‌న భూ బాగోతాలు అంద‌రికి తెలుసు అని ఆయ‌న అన్నారు..కన్నా లక్ష్మినారాయణ కుమారుడు డైరెక్టర్‌గా ఉన్న కంపెనీ భాగోతంపై చర్చిద్దామా? అని బుద్ధా వెంకన్న సవాల్ చేశారు.

Image result for kanna lakshmi narayana chandra babu

సైకిల్‌పై తిరిగిన కన్నాకు భవంతులు, ఢిల్లీలో ఫ్లాట్స్‌ ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో మీ కన్నా కళంకిత మంత్రి ఎవరైనా ఉన్నారా? మోదీ, అమిత్‌ షా రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదువుతూ.. చంద్రబాబుపై అసత్య ప్రచారం చేస్తున్నారని’ బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు దీనిపై బీజేపీ నాయ‌కులు ఎవ‌రూ మాట్లాడ‌లేదు మ‌రి చూడాలి, ఇలాగే ఈ వ్య‌వ‌హారం ఉంటే, టీడీపీ- బీజేపీ ప్ర‌శ్న‌ల ప‌రంప‌రం ఎప్ప‌టి వ‌ర‌కూ కొన‌సాగుతుందో.