విజ‌య‌సాయిరెడ్డి బూట్ల సీక్రెట్ చెబుతున్న బుద్దా వెంక‌న్న

440

ఏపీలో అధికార పార్టీకి ప్ర‌తిప‌క్ష వైసీపీకి మాట‌ల యుద్దం మ‌రింత పెరిగిపోతోంది.. ఒక‌రి మాట‌లు కోటలు దాటుతుంటే మ‌రొక‌రి మాట‌లు గోడ‌లు దాటేలా ఉన్నాయి.. సీఎం చంద్ర‌బాబు పై ఈగ కూడా వాల‌కుండా, ప్ర‌తిప‌క్ష నాయ‌కుల మాట‌ల‌కు కౌంట‌ర్లు ఇచ్చే నాయ‌కులు టీడీపీలో చాలా మంది ఉన్నారు.. మ‌రీ ముఖ్యంగా టీడీపీ మంత్రులు చిన‌రాజ‌ప్ప, సోమిరెడ్డి అలాగే ఎమ్మెల్సీ బుద్దావెంక‌న్న, ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్ వీరు అంద‌రూ సీఎం చంద్ర‌బాబు పై ఎటువంటి విమ‌ర్శ‌లు వ‌చ్చినా వెంట‌నే కౌంట‌ర్ ఇస్తారు..

Image result for vijya sai reddy
తాజాగా సీఎం చంద్ర‌బాబు పై ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చేసిన కామెంట్ల పై ఎమ్మెల్సీ బుద్దావెంక‌న్న ఫైర్ అయ్యారు… విజ‌య‌సాయిరెడ్డి చంద్ర‌బాబు పై ఎటువంటి కామెంట్లు చేస్తున్నారో తెలుస్తోందా అని ఆయ‌న ఫైర్ అయ్యారు..ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బూట్లునాకే స్థితికి విజయసాయిరెడ్డి దిగజారాడని ఆయ‌న విమర్శించారు…. చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలను ఖండిస్తున్నామన్నారు. వైసీపీ నాయ‌కుల‌కు చంద్ర‌బాబును విమ‌ర్శించే అర్హ‌త లేద‌ని, వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి అస‌లు లేదు అని విమ‌ర్శించారు ఆయ‌న.

Image result for buddha venkanna

ఆనాడు త‌ప్పుడు లెక్క‌లు రాసి రాజ‌శేఖ‌ర్ రెడ్డికి, జ‌గ‌న్ కు సాయం చేసిన వ్య‌క్తి విజ‌య‌సాయిరెడ్డి అని ఆయ‌న విమర్శించారు మేము ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేస్తుంటే, వీరు ఊస‌ర‌వెల్లిరాజ‌కీయాలు చేస్తున్నారు అని విమ‌ర్శించారు… వైసీపీ డ్రామాలు తెలుగుదేశం పార్టీ ఒక్క‌టే కాదు ఏపీ ప్ర‌జ‌లు అంద‌రూ చూస్తున్నారు అని ఆయ‌న విమ‌ర్శించారు..

Image result for vijya sai reddy

చంద్రబాబు కేంద్రానికి భ‌య‌ప‌డ‌ర‌ని ఇటు జ‌గ‌న్ మాత్రం, బీజేపీకి భ‌య‌ప‌డుతున్నారు అని విమ‌ర్శించారు బుద్దా.. ఇక కేంద్రం ఏమి చెబితే ఆ డైరెక్ష‌న్లో జ‌గ‌న్ న‌డుస్తున్నారు అని ఆయ‌న విమ‌ర్శించారు.. త‌మిళ‌నాడులో కూడా ప్ర‌ధాని మోడీ వెనుక ఉండి రాజ‌కీయాలు చేస్తున్నారు అని విమ‌ర్శించారు.. త‌ప్ప‌కుండా అవిశ్వాసం పై చేయి సాధిస్తామ‌ని అన్నారు బుద్దావెంక‌న్న.