Breaking News:జనసేన ఎమ్మెల్యే అరెస్ట్ …షాక్ లో పవన్ కళ్యాణ్

84

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పీఎస్‌పై దాడి ఘటనలో ఎమ్మెల్యేపై 3 రోజుల కిందట కేసు నమోదయ్యింది. ఓ గొడవ విషయంలో ఎస్‌ఐ రామారావు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయన్ను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యేతోపాటు జనసేన కార్యకర్తలంతా పీఎస్ ముందు ఆందోళనకు దిగారు. ఈ ముట్టడి సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇవాళ ఎమ్మెల్యేను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ముందస్తుగా రాపాక ముఖ్య అనుచరుల్ని హౌస్‌ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున రాపాక ఇంటికి చేరుకోవడంతో.. అక్కడంతా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది.

ఈ క్రింద వీడియో చూడండి

ఇటీవల ఓ కేసు విషయంపై ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై ఏకవచనంతో మాట్లాడడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మలికిపురం పీఎస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దీనిపై పోలీసుల ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో.. జనసేన కార్యకర్తలంతా ధర్నాకు దిగారు. ఈ సందర్భగా ఉద్రిక్తత తలెత్తడంతో.. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. దీంట్లో భాగంగా ఇవాళ అరెస్టుకు ప్రయత్నిస్తుండంతో.. గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.