వైయ‌స్ వివేకానందరెడ్డికి జ‌గ‌న్ కి మ‌ధ్య పెద్ద గొడ‌వ‌లు రావ‌డానికి ఈ చిన్న‌ప‌నే కార‌ణం

133

వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఆయ‌న అకాల మ‌ర‌ణంతో వైయ‌స్సార్ జిల్లాలో విషాద చాయలు అల‌ముకున్నాయి. పులివెందులలోని స్వగృహంలోనే ఆయన గుండెపోటుతో కుప్పకూలినట్లు తెలిసింది. తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్టు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వివేకానందరెడ్డి సొంత తమ్ముడు. ఆయన అకాల మరణం వైసీపీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేసింది. వైఎస్ వివేకాకు ఒక కుమార్తె ఉంది. వైఎస్ వివేకా ఆగస్ట్ 8, 1950న ఆయన జన్మించారు. వైఎస్ వివేకానందరెడ్డి సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగారు. ఆయన గతంలో కడప లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు పోటీ చేశారు. పులివెందుల నుంచి 1989, 1994లో వైఎస్ వివేకా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక జిల్లాలో నాలుగు ద‌శాబ్దాలుగా వైయ‌స్ కుటుంబం కంచుకోట‌గా పులివెందుల జ‌మ్మ‌ల‌మ‌డుగులో నిల‌దొక్కుకుంది అంటే వైయ‌స్ వివేకా, వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వ‌ల్లే అని చెప్పాలి.

ఈ క్రింది వీడియో చూడండి

వైఎస్ మరణానంతరం ఏర్పడిన కిరణ్ కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. పులివెందులకు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఆయన వదిన విజయమ్మ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం విభేదాలకు స్వస్తి పలికి కుటుంబానికి దగ్గరయ్యారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ తరపున ఆయన పులివెందులలో నిన్న ప్రచారం కూడా చేసినట్లు తెలిసింది. ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించారని మార్చి 3వ తేదీన వైఎస్ వివేకా పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఆయన హఠాన్మరణంతో జగన్ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. హుటాహుటిన లోటస్‌పాండ్ నుంచి పులివెందులకు జగన్ కుటుంబ సభ్యులు బయల్దేరారు. ఇక జ‌గ‌న కు వైయ‌స్ వివేకాకు గ‌తంలో చాలా గొడ‌వ‌లు జ‌రిగాయి ఆయ‌న కొత్త పార్టీ పెట్ట‌ద్దు అని మీ తండ్రి అంటే వైయ‌స్ కు కాంగ్రెస్ అంటే ఇష్టం ఆయ‌న‌కాంగ్రెస్ లో సీఎం అయ్యారు సోనియా మాట విను జ‌గ‌న్ అని ఆయ‌న ప‌లుసార్లు చెప్పారు.

Image result for jagan and vivekananda reddy

కాని జ‌గ‌న్ మాత్రం బాబాయ్ మాట ప‌ట్టించుకోలేదు ఎందుకు అంటే ఆయ‌న సోనియాగాంధీ చేసిన కామెంట్లు ఓదార్పుయాత్ర ఆపివేయాలి అని ఆదేశించ‌డంతో జ‌గన్ కూడా బ్యాక్ స్టెప్ వేయ‌లేదు, ఈ స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుగుబాటుగా జ‌గన్ పై నాయ‌కులు అంద‌రూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేశారు ఆ స‌మ‌యంలో వైయ‌స్ వివేకా కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధేశాల‌తో పులివెందులకు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఆయన వదిన విజయమ్మ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో కుటుంబంలో కూడా పెద్ద ఎత్తున వివాదాలు రావ‌డంతో ఆయ‌న వెంట‌నే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు త‌ర్వాత కొద్దిరోజులు దూరంగా ఉన్నా ఇటీవ‌ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జ‌గ‌న్ పిలిచి మ‌రీ బాబాయ్ కి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వ‌డం జ‌రిగింది కాని ఈ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్సీస్ధానం తెలుగుదేశం పార్టీ గెలుపుచుకుంది.. వైయ‌స్ కుటుంబంలో ఇప్పుడు పెద్ద అన్న‌గా ఉన్న ఆయ‌న రాజ‌కీయంగా పేరు సంపాదించారు అలాగే ప్ర‌జ‌ల్లో మంచి గుర్తింపు పొందారు, ఆయ‌న మ‌ర‌ణంతో వైయ‌స్ కుటుంబం ఓ పెద్ద దిక్కుని కోల్పోయింది అని చెప్పాలి.